పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

నిర్మించబడినవి. వాటికి ఎదురుగా మామిడి ఆకుల తోరణములతోను, ఖద్దరు త్రివర్ణ పతాకములతోను అలంకరించబడిన రెండు పందిళ్ళ వేయబడెను. అందు ఒకటి గాంధీ కుటీరము, కార్యాలయము. రెండవది కసూరిబాయికి, కూడ వచ్చిన వారికి ఏర్పాటు చేయబడెను. మిగిలినవారికి విద్యాలయ ప్రాంగణంలో బస ఏర్పాటుచేసిరి.

సుమారు రెండు వేలమంది ప్రజలు అచ్చట గాంధీజీకి స్వాగతం చెప్పారు. గాంధీజీ సందర్శించిన అన్ని గ్రామములందు ఆయనకు అఖండ స్వాగతం లభించింది. కొన్ని గ్రామములందు గాంధీ దంపతులను పూలమాలతో సత్కరించి, పూజలు గావించారు. గాంధీజీతో కారులో ఉన్న దేశభక్త కొండా వెంకటప్పయ్య గాంధీజీ ఉపన్యాసాలను అనువదించి చెప్పేవారు. దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు, దండు నారాయణరాజు, ఆత్మకూరి గోవిందాచారి పెన్మత్స పెద్దిరాజు, 2OOO వియ్యన్న పంతులు గాంధీజీ కారుకు మార్గాన్ని చూపుతూ ముందు కారులో ప్రయాణించేవారు. 7 జిల్లాయందు గాంధీజీ యాత్రలో లంకలకోడేరు వాస్తవ్యుడగు సయ్యపురాజు వెంకటరాజు గాంధీజీకి అంగరక్షకునిగా వ్యవహరించారు

గాంధీజీ మధ్యహ్నం 3 గం. ల వరకూ రాట్నముతో నూలువడకుచూ ఇష్టాగోష్టి జరిపారు. జాతీయ పాఠశాల ప్రిన్సిపల్ వేమూరి రామకృష్ణారావు విద్యావిధానమును గూర్చి గాంధీజీతో చర్చించారు. ఖద్దరు వ్యాపకమును జిల్లాలో అభివృద్ధి చేయుటకై ఎక్కువగా చర్చించారు. సాయంత్రము గాంధీజీ కార్యక్రమము ఎంతో వత్తిడికి గురైంది. 5 గం. లు అయ్యేసరికి జనం క్రిక్కిరిసి పోయి విద్యాలయం వద్ద గాంధీజీ కారుకదులుటయే కష్టమైంది. కాలువ రోడ్డుపై ఫర్గాంగువరకు ఇసుక వేసినరాలనంత జనసందోహం గుమిగూడారు. ఎంతో కష్టముగా పయనించి సాయంత్రం గం. 5.55ని.లకు గాంధీజీ "శ్రీమతి అన్నపూర్ణాదేవి బాలికల పాఠశాల"కు, అచ్చటనుండి పురమందిరమునకు వెళ్ళారు. అచ్చట సమావేశమయిన రెండు వేలమంది స్త్రీలను ఉద్దేశించి ఐదు నిమిషములు ఉపన్యసించారు. 'మీరు ఖద్దరు చీరలను కట్టండి. నాడు స్వర్గీయ అన్నపూర్ణాదేవి, నేడు ఎలమంచిలి సత్యవతి ఒసంగినట్లు మీ నగలను విరివిగా ఖద్దరు నిధికి సమర్చించండి. స్త్రీలకు నిజమయిన భూషణ మెట్టిదో సీతాదేవి చరిత్ర’ చదివిన స్పష్టమగుతుంది. మీరు ఆభరణములు ఇవ్వదలచుకొనిన ఇప్పడే ఇచ్చివేయండి'కి అని ఉద్బోదించారు. కాలాతీతమగుటచే గాంధీజీ ఉపన్యాసాన్ని తగ్గించి, ధనము, ఆభరణములను వసూలు చేయించారు. తాడేపల్లి సత్యవతీజయదేవి రూ.100/- బలుపూడి సుందరమ్మ బంగారు