పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

జత గాజులు, భాగవతుల లక్ష్మీనరసమ్మ బంగారు కంఠమాల ఇంకా చాలా మంది ఖద్దరు నిధికి సమర్పించారు.

ఏలూరులో బహిరంగ సభ

సాయంకాలము 6.35 ని! మైదానములో గాంధీజీ పెద్ద బహిరంగ సభలో సంగ్రహముగా ఉపన్యసించారు. వివిధ సంఘములవారు స్వాగత పత్రములు సమర్పించారు. స్వచ్ఛంద సేవకులు ఏలూరు పౌరులతరపున స్వాగత పత్రము, ఆంధ్ర చిత్రకళా పరిషత్తు చిత్రకారులు తాము వేసిన చిత్రరూపాలు బహూకరించారు.

ఏలూరు పౌరుల స్వాగతపత్రము

శ్రీయుత మొూహన్దాస్ కరంచంద్ గాంధీగారికి,

ఆర్యా !

1. పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య స్థానమగు ఏలూరు పురవాసులమైన మేము మా పురాతన నగరమున తమకు హృదయ పూర్వకమైన స్వాగత మొసంగుచున్నాము.

2. మా పురపాలక సంఘము, ఒక సంవత్సరకాలము నిర్జీవావస్థ యందుండిన పిదప ఇటీవలనే పునర్నిర్మాణమయ్యెను. ప్రథమ సమావేశము జరుపు కొనకుండ సివిలు కోర్డుచే మొన్ననే నిరోధించబడుటచే తమకు అర్జరీతిన స్వాగతమిచ్చు మహాభాగ్యము నకునోచుకోనందుకు విచారించుచున్నాము.

3. తమరు వెనుక ఏలూరు పురమునకు వచ్చిన నాటినుండియు జాతీయ పునరుజ్జీవనమునకై తాము చేయుచున్న కృషియందెల్ల మేము యధా శక్తిని పాల్గొను చునేయున్నాము. మాపురమందలి గాంధీ మహావిద్యాలయము తమ ఎడలను, తమ సిద్దాంతములందును మూకుగల పరిపూర్ణ విశ్వాసమును సూచింపగలదని వినయముగా మనవి చేయుచున్నాము. -

4. 1921లో తాము ప్రారంభించిన మహోద్యమము నిరాంటకముగా కొనసాగి మన గమ్యస్థానమగు స్వరాజ్యమును బడయునుగాక అని హృదయపూర్వకముగా నభిలషించుచున్నాము. భారత జాతీయ ఉద్యమమును మేము త్రికరణ శుద్ధిగా දිරියළුටඩ්ටඩ් ఎట్టి కష్ట నిష్కరములకును వెనుదీయక తమయాజ్ఞకు బదులమైనడువగలమని వక్కాణించుచున్నాము.

5. మహాత్మా! వేుము తమ్మును స్తోత్రము చేయబూనలేదు. ఐననూ