పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

ఆభరణములు సమర్పించబడ్డాయి. వసంతవాడయందు సన్మాన పత్రంతో పాటు రూ. 602/- ఖద్దరునిధికి చేకూరింది. మహాత్ముడు కొక్కిరిపాడునందు ఉన్న 40 చేనేత మగ్గముల వారిని ఖద్దరునే నేయవలెనని కోరారు. అందరూసమైక్యంగా ఉండవలెనని, త్రాగుడు మానవలెనని, ఖద్దరును ధరించవలెనని బోధించారు.

తరువాత గాంధీజీ నాయుడుగూడెం వెళ్ళారు. అక్కడ గారపాటి సాంబయ్యగారి కుమార్తె 21 సం||లు గల బాలవితంతు శ్రీమతి ఎలమంచిలి సత్యవతమ్మ రూ. 1400/- విలువ గల తన 100 కాసుల బంగారు అభరణములను గాంధీజీకి సమర్పించి, గాంధీ ఆశ్రమంలో ఉండటానికి అనుమతినివ్వవలసినదని గాంధీజీని ప్రార్ధించింది. గాంధీజీ అందుకు వెంటనే అంగీకరించారు. ఆమె భర్త ఎలమంచిలి వెంకటరామయ్య చెన్నపురి యందు ఇండియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చదువుతూ 1928లో শুতি-তৰ্পং০ওঁ* మరణించారు. ఈ పర్యటన ముగిసిన తదుపరి ఆమెను ఆశ్రమమునకు పంపగలమని ఆమెతల్లిదండ్రులు చెప్పారు.

తరువాత గాంధీజీ పెదపూళ్ళ వెళ్ళి ఆ గ్రామసుల సన్మానపత్రంతో పాటు రూ. 1116 /- ఖద్దరు నిధి స్వీకరించారు. అక్కడ పెద్దబహిరంగసభలో ఉపన్యసించారు. 89 ఉపన్యాసంలో ఖద్దరును ఉత్పత్తి చేయమని, ధరించమని బోధించటంతోపాటు యలమంచిలి సత్యవతి నగలను ఖద్దరునిధికి ఇచ్చటను, ఆమెత్యాగశీలతను ప్రశంసించారు. ఆమె దయనీయ జీవితాన్ని గూర్చి జాలికరంగా మాట్లాడుతూ, ఆమె పైూషాలో ఉన్నదని, ఫెూషా తొలగించవలెనని, ఆమెకు అంగీకారమయిన పునర్వివాహము చేసుకొనుటకు అనుమతించవలెనని కోరారు. భార్యచనిపోయిన భర్త వివాహం చేసుకొంటున్నప్పుడు, భర్తచనిపోయిన భార్య తిరిగి ఎందుకు వివాహం చేసుకొనరాదని ప్రశ్నించారు. వితంతువుగా ఉండి బ్రహ్మచర్యం అవలంబిస్తే మంచిదే కాని నిర్బంధ బ్రహ్మచర్యం ఎంత మాత్రం తగదని అన్నారు. నీ ఉపన్యాసం అనంతరం దండు నారాయణ Ο ορΣο విదేశీవస్తాలను పోగుచేసి గుట్టగావేసి దగ్ధంచేశారు.

Yeo68 అచ్చటనుండి పనుకొల్ల, కలపర్రుమీదుగా వటూరు చేరారు. ఆయా (6੦ ప్రజలు ఖద్దరు నిధికి రూ.100/- రూ. 140/- రూ.516/- సమర్పించారు. గాంధీజీ వటూరునందు తన మెడలో వేసిన ఖద్దరు దండను వేలం వేయగా రూ. 16/–లకు ఒకరు కొన్నారు. ఉ| 10-30 నిuలకు (Yeටඨිසී ಬೃ೦ದಿ೦ ఏలూరునందలి గాంధీజాతీయ పాఠశాల'కు చేరుకున్నారు. విద్యాలయ ప్రాంగణంలో రెండు తాటిఆకుల కుటీరములు