పుట:Oka-Yogi-Atmakatha.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

ఒక యోగి ఆత్మకథ

ఆ సాధువు ఒక్క క్షణం మౌనం వహించాడు; తరవాత వక్రంగా సమాధాన మిచ్చాడు.

“సర్వ సుగుణాలకి నిలయుడై అగోచరుడైన భగవంతుణ్ణి ఒక పక్కా, అటువంటి వేమీ లేనట్టు కనిపించే మానవుణ్ణి మరొక పక్కా ప్రేమించడమన్నది, తరచు దిగ్భ్రమ కలిగిస్తూ ఉంటుంది! వ్యూహానికి తగ్గట్టుగానే ఉంటుంది బుద్ధికుశలత. అంతఃపరిశోధన, మానవులందరి మనస్సుల్లోని ఏకత్వాన్ని- అంటే స్వార్థపరత్వమనే దృఢబాంధవ్యాన్ని - బయట పెడుతుంది. కనీసం ఈ ఒక్క విషయంలోనైనా మానవుల్లో సోదరభావం వెల్లడి అవుతున్నది. సమత్వాన్ని చూపించే ఈ ఆవిష్కారాన్ని అనుసరించి నివ్వెరపాటుతో కూడిన వినమ్రత వస్తుంది. ఆత్మకున్న, అన్వేషణయోగ్యమైన స్వాస్థ్యదాయక శక్తుల్ని గమనించకుండా ఇది, తోటివాళ్ళ మీద కనికరంగా మారుతుంది.”

“ప్రపంచం అనుభవించే దుఃఖాల్ని గురించి ప్రతి యుగంలోని సాధువులూ మీలాగే బాధపడ్డారండి.”

“ఇతరుల జీవితాల్లో కనిపించే దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయినవాడు ఒట్టి డాంబికుడు.” గంభీరంగా ఉన్న ఆ సాధువు ముఖం గమనించగలిగినంతగా ప్రశాంతమయింది. “శస్త్రంతో ఆత్మ విచ్ఛేదన చేసుకోడం అభ్యసించినవాడు, విశ్వజనీనమైన అనుకంపను విస్తరింపజేయడం తెలుసుకుంటాడు. చెవులు ఊదరగొడుతూ, అధికార పూర్వకంగా అహంకారం వెల్లడించే కోరికల నుంచి అతనికి విముక్తి కలుగుతుంది. అటువంటి నేలలో దైవప్రేమ పుష్పిస్తుంది. చివరికి జీవుడు మరెందుకూ కాకపోయినా- “ఎందుకని? ప్రభూ, ఎందుకని?” అంటూ ఆక్రోశించడానికి సృష్టికర్త వేపు తిరుగుతాడు. బాధ అనే దారుణ కళా