పుట:Oka-Yogi-Atmakatha.pdf/878

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

842

ఒక యోగి ఆత్మకథ

కొని ఉంది కాబట్టి, యోగి ప్రమేయం పెట్టుకునేది మనోనిగ్రహంతోనే.[1] కర్మసంబంధమైన అజ్ఞానం తాలూకు వివిధకోశాల్ని విసర్జించిన తరవాత మానవుడు, తనను స్వస్వరూపంలో దర్శిస్తాడు.

భూమిమీద మానవుడి మజిలీకి ఏకెక ప్రయోజనం జీవన్మరణాల నిగూఢ రహస్యాన్ని ఛేదించడమే; ఈ నిగూఢ రహస్యం, శ్వాసతో గట్టిగా ముడిపడి ఉంది. ఊపిరి లేకపోవడమంటే, చావు లేకపోవడం, ఈ సత్యాన్ని తెలుసుకొని, భారతదేశపు సనాతన ఋషులు ఊపిరికి ఏకైక కీలకాన్ని కనిపెట్టి, ఊపిరిలేకుండా ఉండడానికి సంబంధించిన సునిశిత, సహేతుక శాస్త్రం ఒకటి రూపొందించారు.

ప్రపంచానికి అందించడానికి భారతదేశం దగ్గర మరేదీ లేకపోయినా రాజోచితంగా ఇయ్యగల ‘క్రియాయోగం’ ఒక్కటే చాలు.

శరీరానికి ఆత్మకూ మధ్య సూక్ష్మమైన లంకెగా పనిచేయడానికి.

  1. “యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా,
      యోగినో యత చిత్తస్య యుజ్జ్యతో యోగమాత్మనః.

      యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా,
      యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి.

      సుఖమాత్యంతికిం యత్తద్ బుద్ధి గ్రాహ్యమతీంద్రియం,
      వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః,

      యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః,
      యస్మిన్‌స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే.

      తం విద్యాద్దుఃఖ సంయోగవియోగం యోగసంజ్ఞితం
      స నిశ్చయేన యోక్తవ్యో యోగో౽నిర్విణ్ణచేతసా.

    - భగవద్గీత 6 : 19-24