పుట:Oka-Yogi-Atmakatha.pdf/879

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1940 - 1951 మధ్యకాలం

843

దేవుడు ఊపిరిని కల్పించాడన్న సంగతి హిబ్రూ ప్రవక్తలకు బాగా తెలుసన్న విషయాన్ని వెల్లడించే ఘట్టాలు కొన్ని బైబిలులో ఉన్నాయి. ‘జెనిసిస్’ లో ఇలా ఉంది: “ప్రభువైన దేవుడు నేలమీది మట్టిలోంచి మనిషిని చేసి అతని ముక్కుల్లోకి ప్రాణవాయువు ఊదాడు. అప్పుడు మనిషి, జీవించే ఆత్మ అయాడు.[1] మానవశరీరం, “నేలమీది మట్టి”లో కూడా కనిపించే రసాయనిక, ఖనిజ పదార్థాలతో ఏర్పడినది. అజ్ఞాన మానవుల్లో, ఊపిరి (వాయురూపశక్తి) ద్వారా శరీరానికి ఆత్మ ప్రసరణ చేసే ప్రాణశక్తి ప్రవాహాలే కనక లేకపోయినట్లయితే, రక్తమాంసాలు గల మానవదేహం, తన కార్యకలాపాల్ని ఎన్నడూ కొనసాగించగలిగి ఉండేది కాదు; శక్తినీ చలనాన్నీ ప్రదర్శించగలిగీ ఉండేది కాదు. మానవ శరీరంలో పంచప్రాణాలుగా, అంటే సూక్ష్మ ప్రాణశక్తులుగా పనిచేసే ప్రాణశక్తి ప్రవాహాలు సర్వవ్యాప్తమయిన ఆత్మతాలూకు ఓంకార స్పందనకు అభివ్యక్తులు.

ఆత్మ అనే మూలస్రోతస్సు నుంచి వెలువడి మాంసకణాల్లో ప్రకాశించే ప్రాణం ప్రతిబింబం, లేదా సత్యాభాసం ఒక్కటే, మానవుడికి తన శరీరంతో అనుబంధం ఉండడానికి కారణం; సహజంగా అతడు ఒక మట్టిముద్దకు ఆదరపూర్వకంగా నివాళి అర్పించలేడు. ఎవరయినా ఒకరు తన భౌతికరూపమే తానని తప్పుగా గుర్తిస్తున్నారంటే, దానికి కారణం, ఆత్మనుంచి వచ్చే ప్రాణశక్తి ప్రవాహాలు - మానవుడు కార్యాన్నే (ఫలితాన్నే) కారణంగా అపార్థంచేసుకునేటంత గాఢమైన శక్తితో, ఊపిరిద్వారా మాంసంలోకి ప్రవేశించడం. శరీరానికి సొంత ప్రాణం ఒకటి ఉందని దేహారాధనపరత్వంతో ఊహించడం.

మానవుడి చేతనస్థితి, శరీర శ్వాసల స్పృహ. నిద్రలో చురుకుగా

  1. జెనిసిన్ 2 : 7 (బైబిలు)