పుట:Oka-Yogi-Atmakatha.pdf/877

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1940 - 1951 మధ్యకాలం

841

దైవానుసంధానావకాశం లేకుండా చెయ్యలేదన్న మాట. ఆత్మస్మరణకు అతనికి కావలసినవల్లా, క్రియాయోగ ప్రక్రియా, నిత్యజీవితంలో నైతిక నియమపాలనా, “ఈశ్వరా, నిన్ను తెలుసుకోడానికి తపించిపోతున్నాను!” అంటూ, చిత్తశుద్ధితో మొరపెట్టుకోగల సామర్థ్యమూ.

సగటు మనిషి తన భావావేశ పరిధికి బాహ్యంగా ఉంటాడు కాబట్టి దేవుణ్ణి భక్తి ప్రపత్తుల ద్వారా చేరడానికి ప్రయత్నించడం కంటె, ప్రతి రోజూ సాధన చెయ్యడానికి వీలయిన ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా చేరడానికి ప్రయత్నించడం మేలని యోగవిద్య తెలుపుతుంది. అందువల్ల దీనికి, విశ్వజనీనమైన ఆకర్షణ ఉంది.

భారతదేశంలో గొప్ప జైనగురువుల్ని “తీర్థంకరులు” (మార్గ దర్శులు) అంటారు; అలా అనడానికి కారణం, దిగ్భ్రమలో మునిగి ఉన్న మానవజాతి, సంసార కర్మ చక్రభ్రమణంలో జననమరణాల పునరావృత్తి అనే తుఫాను సముద్రాల్ని దాటిపోవడానికి వీలయిన దారిని వాళ్ళు చూపిస్తారు కనక. సంసారం (అంటే, దృగ్విషయిక ప్రవాహంలో “ప్రవహిస్తున్న”), కనీస నిరోధమార్గాన్ని అనుసరించడానికి మనిషిని ప్రేరేపిస్తుంది. “కాబట్టి ప్రపంచానికి స్నేహితుడైనవాడల్లా దేవుడికి

శత్రువు.”[1] దేవుడికి స్నేహితుడవాలంటే మానవుడు, ప్రాపంచిక మాయాజాలాల్లో, తనలో ఎప్పుడూ దౌర్బల్యానికి దోహదంచేసే దుష్కర్మ ఫలాల్ని తప్పకుండా జయించాలి. కఠోర కర్మసూత్రాన్ని గురించిన జ్ఞానం, దాని బంధాలనుంచి విడివడి, చరమ విముక్తికి మార్గం కనుక్కోడానికి చిత్తశుద్ధితో అన్వేషించేవాణ్ణి ప్రోత్సహిస్తుంది. మానవుల కర్మ దాస్యం, మాయవల్ల అంధకారమయమైన ముషస్సుల్లోని కోరికల్లో సాధు

  1. జేమ్స్ 4 : 4 (బైబిలు).