పుట:Oka-Yogi-Atmakatha.pdf/873

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1940 - 1951 మధ్యకాలం

837

జేసిన చెడులను ప్రతి మానవుడి[1] లోనూ వాస్తవికంగా చూపించవచ్చు. ఆదర్శరాజ్యం (Utopia) అనేది పౌర సద్గుణంతో పుష్పించే ముందు ప్రతి హృదయంలోనూ మొలకెత్తాలి. ఆంతరిక సంస్కరణలు సహజంగా బాహ్యమైన వాటికి దారి తీస్తాయి. తనను తాను సంస్కరించుకున్న వాడు వేలాది జనాన్ని సంస్కరిస్తాడు.

మానవుడికి ఊర్ధ్వగతికి ఉత్ప్రేరణ కలిగిస్తూ, కాలపరీక్షకు నిలిచి ఉన్న ప్రపంచ పవిత్ర గ్రంథాలన్నిటి సారమూ ఒక్కటే. నా జీవితంలో అన్నిటికన్న ఆనందంగా గడిపిన కాలాల్లో ఒకటి, బైబిలు కొత్త నిబంధన గ్రంథంలో కొంత భాగానికి, “సెల్ఫ్ రియలైజేషన్” కోసం నేను నా వ్యాఖ్యానం చెబుతూ రాయించడంలో గడించింది. ఇరవై శతాబ్దాల పాటు హానికరమైన అపార్థానికి గురిఅయిన క్రీస్తు మాటల్లో అనేకమైనవాటి నిజమైన అర్థాల్ని తరచి చూడ్డంలో, నాకు దారి చూపించమని ఆయన్ని గాఢంగా ప్రార్థించాను.

ఒకనాడు రాత్రి, నేను మౌనప్రార్థనలో మునిగి ఉన్నాను. ఎన్సినిటాస్ ఆశ్రమంలో నేను కూర్చునే గది, ఇంద్రనీలమణి కాంతితో నిండిపోతూ వచ్చింది. పుణ్యమూర్తి ఏసుప్రభువు తేజోమయరూపాన్ని దర్శిం

  1. దృగ్విషయిక లోకాలన్నీ రూపొందడానికి కారణమైన దైవలీల, లేదా “విలాసక్రీడ” ప్రణాళిక, సృష్టికీ స్రష్టకూ ఉన్న అన్యోన్యాశ్రయ సంబంధాల్లో ఒకటి. మానవుడు దేవుడి కివ్వగలిగిన ఒకే ఒక కానుక ప్రేమ; ఆయన అపారకృపకు పాత్రుడు కావడానికి అదొక్కటి చాలు. “మీరు నావన్నీ దొంగిలించేశారు, మొత్తం ఈ దేశంతో సహా; నా మందిరంలో ఆహారముండేటందుకు పదోవంతు పన్నులన్నీ ఈ గిడ్డంగికి తీసుకురండి; ఇప్పుడే ఇక్కడే నాకు నిరూపించండి అన్నారు అతిథుల దేవుడు (యోహోవా). నేను మీ కోసం స్వర్గమందిరం కిటికీలు కనక తెరవకపోతే, మీకు ఆశీస్సు కురిపించకపోతే దాన్ని స్వీకరించడానికి మీకు చాలినంత చోటే ఉండదు.” మలాకి 3:9 -10 (బైబిలు)