పుట:Oka-Yogi-Atmakatha.pdf/872

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

836

ఒక యోగి ఆత్మకథ

అభివ్యక్తం చెయ్యడానికి వీలయిన అనంతమైన మార్గాల్ని ఇంకా సంపూర్ణంగా తెలుసుకోడానికని ఈ భూమికి ఆకృష్టుడయాడని హిందూ పవిత్రగ్రంథాలు ఉద్బోధిస్తున్నాయి. ప్రాచ్యపాశ్చాత్యాలు రెండూ ఈ మహాసత్యాన్ని వివిధ మార్గాల్లో తెలుసుకుంటున్నాయి; తాము కనిపెట్టిన వాటిని అవి ఒకదానితో ఒకటి సంతోషంగా పంచుకోవాలి. భగవంతుడికి భూమిమీద గల తన సంతానం – దారిద్ర్యం, రోగం, ఆత్మజ్ఞానరాహిత్యం లేని ప్రపంచ నాగరికతను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటే సంతోషంగా ఉంటుందన్న విషయంలో సందేహానికి తావు లేదు. మానవుడికి తన ఆత్మశక్తుల విషయంలో ఏర్పడ్డ మరుపే (తన స్వతంత్రేచ్ఛను[1] దుర్వినియోగం చేసినందువల్ల కలిగిన ఫలితం) ఇతర రకాల బాధలన్నిటికీ మూలకారణం. “సమాజం“” అనే మానవత్వారోపితమైన ఊహకు వర్తింప


.

  1. “ స్వేచ్ఛగా సేవిస్తాం మనం
      స్వేచ్ఛగానే ప్రేమిస్తాం కనక; మన సంకల్పంలో ఉంది
      ప్రేమించడమో మానడమో; ఇందులోనే, మనం నిలిచినా కూలినా.
      కొందరు పతనమయారు, అవిధేయతకు పాల్పడి పతనమయారు
      ఆ నాకంనుంచి లోతయిన నరకంలోకి, ఎంత పతనం
      ఎంత ఉన్నతానంద స్థితినించి ఎంత విషాదస్థితికి!”

    – మిల్టన్, ‘పేరడైజ్ లాస్ట్’