పుట:Oka-Yogi-Atmakatha.pdf/852

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

816

ఒక యోగి ఆత్మకథ

వారు ఆయనే. ఒక పెద్ద సభామందిరానికి చేరి, గుమ్మం దాటి ఆదృశ్యమయారు.

“ ‘అమ్మా, అమ్మా! నేను మునిగిపోతున్న సమయంలో కనిపించినాయన ఆయనే నమ్మా” అని అరిచాను.

“అమ్మా నేనూ గబగబా ఆ భవనంలోకి చొరబడ్డాం; ఆయన ఉపన్యాసవేదిక మీద కూర్చుని ఉన్నారు. ఆయన భారతదేశం నుంచి వచ్చిన స్వామి వివేకానందగారు[1] అని త్వరలోనే తెలుసుకున్నాం. ఆయన ఆత్మోత్తేజం కలిగించే ప్రసంగం చేసిన తరవాత, ఆయన్ని కలుసుకోడానికి నేను ముందుకు వెళ్ళాను. అప్పటికే మేము పాతస్నేహితులమయినట్టు, ఆయన నావేపు చూసి మృదువుగా చిరునవ్వు నవ్వాడు. నేను చిన్నవాణ్ణి అవడంవల్ల నా మనస్సులో ఉన్న భావాల్ని ఎలా చెప్పాలో తెలియలేదు; కాని ఆయన నాకు గురువుగా ఉంటానని ఆయనే చెబుతారేమోనని ఆశపడ్డాను. ఆయన నా ఆలోచన పసిగట్టారు.

“ ‘కాదు నాయనా, నేను నీ గురువును కాను.’ అందమైన కళ్ళతో నా కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూశారు వివేకానందగారు. ‘నీ గురువు తరవాత వస్తాడు. ఆయన నీకో వెండికప్పు ఇస్తాడు.’ అన్నారు. తరవాత కొంతసేపు ఆగి చిరునవ్వు నవ్వుతూ, ‘నువ్విప్పుడు భరించగలవాటికన్న అధికంగా ఆశీస్సులు కురిపిస్తాడాయన,’ అన్నారు.

“మరి కొద్దిరోజుల్లో నేను షికాగో నుంచి వచ్చేశాను,” అంటూ చెప్పసాగాడు శ్రీ డికిన్సన్. వివేకానంద అనే ఆ మహావ్యక్తిని నేను మళ్ళీ ఎన్నడూ చూడలేదు. కాని ఆయన పలికిన ప్రతి పలుకూ నా అంతశ్చేతనలో చెరగని అక్షరాల్లా ముద్ర పడిపోయింది. ఏళ్ళు గడిచిపోయాయి;

  1. క్రీస్తువంటి మహామహులైన రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యులు.