పుట:Oka-Yogi-Atmakatha.pdf/824

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

788

ఒక యోగి ఆత్మకథ

ఉచితంగా ప్రసాదించిన గాలిని మొదటి ఊపిరిగా మానవుడు తీసుకొన్నప్పుడే ఏర్పడింది.

రాంచీ సందర్శన తరవాత మరో సందర్భంలో నేను ఆనందమయి మాతను చూసే అవకాశం కలిగింది. కొన్ని నెలల తరవాత ఆవిడ శ్రీరాంపూర్ స్టేషను ప్లాట్‌ఫారం మీద తమ శిష్యులతో, బండికోసం ఎదురు చూస్తోంది.

“బాబా, నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను,” అని చెప్పింది ఆవిడ. “కొందరు దయాపరులు డెహ్రాడూన్‌లో మాకో ఆశ్రమం కట్టించారు.”

ఆవిడ బండి ఎక్కుతుండగా - గుంపు మధ్యలో ఉన్నా, రైల్లో ఉన్నా, విందు ఆరగిస్తున్నా, మౌనంగా కూర్చుని ఉన్నా ఆమె కళ్ళు భగవంతుడిమీంచి మళ్ళేవి కావని గమనించి నేను ముగ్ధుణ్ణి అయాను. నాలో ఇప్పటికీ, అమేయ మాధుర్యం గల ఆమె కంఠస్వరం వింటూనే ఉంటాను;

“చూడు, ఇప్పుడూ ఎప్పుడూ కూడా ఆ నిత్యాత్మతో ఏకమై ఉండి నేను ఎప్పటికీ దాన్నే.”