పుట:Oka-Yogi-Atmakatha.pdf/825

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 46

నిరాహార యోగిని

“సార్, ఈ ఉదయం మనం ఎక్కడికి వెళ్తున్నాం?” శ్రీ రైట్ ఫోర్డు కారు నడుపుతున్నాడు; రోడ్డు మీంచి చూపు నావేపు మళ్ళించి ప్రశ్నార్థకంగా చూశాడు. అటుతరవాత తాను బెంగాలులో ఏ ప్రాంతం కనుక్కోబోతున్నాడో అతనికి అంతగా తెలిసేది కాదు.

“దేవుడు తలిస్తే, ఇప్పుడు మనం, ప్రపంచంలో ఎనిమిదో వింత చూడ్డానికి వెళ్తున్నాం- పలచని గాలి మట్టుకే భోంచేసే యోగినిని చూడ్డానికి వెళ్తున్నాం!”

“థెరిసా నాయ్‌మన్ చూసిన తరవాత - వింతలే వింతలు!” అయినా శ్రీ రైట్ కుతూహలంగా నవ్వాడు; పైగా కారువేగం పెంచాడు కూడా. అతని యాత్రా దినచర్య పుస్తకంలోకి ఎక్కడానికి ఇంకా అసాధారణమైన ముడిసరుకు దొరికింది; సామాన్య పర్యాటకుడికి దొరికే మాదిరిగా ఒకటో, అరో కాదు!

రాంచీ విద్యాలయం దాటి అప్పుడే బయటికి వచ్చాం; ఆ రోజు సూర్యుడికంటె ముందే మేలుకున్నాం. మా బృందంలో, మా కార్యదర్శీ నేనూ కాక, మరో ముగ్గురు బెంగాలీ స్నేహితులు కూడా ఉన్నారు. ఉల్లాసకరమైన చల్లగాలి పీల్చుకున్నాం; పొద్దుటిపూట దొరికే సహజ మధువు అదే. వేకువజామునే పనులకు బయలుదేరే రైతుల మధ్యమంచి రోడ్డుమీద మెల్లగా సాగే ఎడ్లబండ్ల మధ్యనుంచి కారు మెలకువగా నడి