పుట:Oka-Yogi-Atmakatha.pdf/823

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బెంగాలీ "ఆనందమయి మాత"

787

వెళ్ళింది. వర్షిస్తున్న గులాబి రేకుల మధ్య ఆమె, పసివాళ్ళని దీవిస్తూ చేతులు పైకి ఎత్తింది. వాళ్ళ ముఖాలు, అప్రయత్నంగా ఆవిడ చూపించిన ఆప్యాయతతో ప్రకాశ మానమయాయి.

“నీ ప్రభువును నువ్వు సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ మనస్సుతో, సంపూర్ణ బలంతో ప్రేమించాలి,” అంటూ ప్రకటించాడు. క్రీస్తు. “ఇది మొట్టమొదటి ఆజ్ఞ.”[1]

ఆనందమయి మాత, అల్పమైన ప్రతి అనుబంధాన్నీ తెంచుకొని ప్రభువు కొక్కడికే తన విధేయత చూపించింది. పసిపాపలాంటి ఈ సాధ్వి మానవ జీవితపు ఏకైక సమస్యను - అంటే, భగవంతుడితో ఐక్య స్థితి ఏర్పరచుకోడమనే సమస్యను - పండితుల మాదిరిగా సూక్ష్మేక్షికలతో కాకుండా, సునిశ్చిత విశ్వాసపరమైన తర్కంతో పరిష్కరించారు. లక్షోప లక్షల విషయాలతో పొగచూరిపోయిన ఈ నితాంత సరళత్వాన్ని మానవుడు మరిచిపోయాడు. దేవుడిపట్ల అనన్యమైన ప్రేమను తిరస్కరించి ప్రపంచదేశాలు, బాహ్యమైన ఔదార్యాలయాలపట్ల సునిశిత ఆదరంతో తమ నాస్తికతను కప్పిపుచ్చుతున్నాయి. మానవతాదృష్టితో చేసే ఉపకారాలు, మనిషి దృష్టిని క్షణకాలంపాటు తన మీంచి మళ్ళించేటట్టు చేస్తాయి కనక - అవి మంచివే; కాని మొదటి ఆజ్ఞగా ఏసుక్రీస్తు ప్రస్తావించిన జీవిత ఏకైక బాధ్యతనుంచి అతనికి విముక్తి ప్రసాదించవు. దేవుణ్ణి ప్రేమించాలన్న ఉద్ధారక కర్తవ్యం, తన ఏకైక సంరక్షకుడు[2]

  1. మార్కు 12: 30.
  2. “కొత్తగా, ఇంతకన్న మేలుగా ఉండే ప్రపంచాన్ని సృష్టించాలన్న ఆకాంక్ష అందరికీ కలుగుతుంది. మీరు అటువంటి విషయాల మీదికి మనస్సు పెట్టకుండా అంతకన్న పరిపూర్ణమైన శాంతి లభించే అవకాశం ఉన్న దైవచింతన మీద మనస్సు నిలపండి. దైవాన్వేషకుడు, లేదా సత్యాన్వేషకుడు, కావడం మానవుడి విధి” - ఆనందమయి మాత.