పుట:Oka-Yogi-Atmakatha.pdf/821

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బెంగాలీ "ఆనందమయి మాత"

785

ఎప్పుడూ హృదయంలో ఒక చిన్న స్వర్గాన్ని నిలుపుకొని సంచరిస్తూ ఉంటుంది.

“ఇక్కడ అందంగా ఉంది,” ఆనందమయి మాతను నేను ప్రధాన భవనంలోకి తీసుకువెళ్తున్నప్పుడు ఆవిడ దయతో అన్న మాటలివి. పసిపాపలా చిరునవ్వు నవ్వుతూ నా పక్కన కూర్చుంది. ఆవిడ ఎవరికయినా ప్రేమాస్పదులందరిలోకి అతి దగ్గరిదాన్ని అనిపించేటట్టు చేస్తుంది; అయినా ఆవిడచుట్టూ దూరత్వ పరివేషం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. భగవత్స్వరూపమైన సర్వవ్యాపకత్వంలో విరోధాభాసంగల వేర్పాటు ఇది.

“నీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పమ్మా.”

“బాబాకి తెలుసు, అదంతా; మళ్ళీ చెప్పడమెందుకు?” ఒక చిన్న జన్మ తాలూకు వాస్తవ చరిత్ర ఏమంత తెలుసుకోవలసింది కాదని ఆమె భావిస్తున్నట్టు స్పష్టమవుతున్నది.

నేను మెల్లగా మరోసారి మనవిచేసి నవ్వాను.

“బాబా, చెప్పడానికి అట్టే లేదు,” అంటూ ఆవిడ, అవసరంలేదని సూచిస్తున్నట్టుగా చేతులు విస్తరించింది. “నా చేతన ఎన్నడూ ఈ తాత్కాలిక శరీరంతో ముడిపడి ఉండలేదు, బాబా, నేను[1] ఈ భూమి మీదికి రాకముందు ‘నేను దాన్నే,’ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ‘నేను దాన్నే.’ పెరిగి

  1. శ్రీ శ్రీ ఆనందమయి మాత తన నెప్పుడూ “నేను” అని ప్రస్తావించదు. “ఈ దేహం” అని కాని, “ఈ అమ్మాయి” అని కాని, “మీ బిడ్డ” అని కాని సవినయంగా, డొంక తిరుగుడు మాటలు వాడుతుంది. అంతే కాకుండా, తాను ఎవరినీ “శిష్యుడు” అని కాని “శిష్యురాలు” అని కాని చెప్పదు. వ్యక్తి ప్రమేయంలేని జ్ఞానంతో ఈవిడ, జగజ్జననిగా మానవులందరిమీదా దివ్యప్రేమను కురిపిస్తుంది.