పుట:Oka-Yogi-Atmakatha.pdf/822

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

786

ఒక యోగి ఆత్మకథ

పెద్దదాన్ని అయాను; అయినా ‘నేను దాన్నే.’ నా పుట్టింటివాళ్ళు ఈ శరీరానికి పెళ్ళి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ‘నేను దాన్నే.’

“బాబా, మీ ఎదుట ఇప్పుడూ ‘నేను దాన్నే.’ ఆ తరవాత అనంత విశ్వంలో నా చుట్టూ సృష్టినర్తనం మారినప్పటికీ ‘నేను దాన్నే.’

ఆనందమయి మాత ధ్యానస్థితిలో మునిగిపోయింది. ఆమె శరీరం రాయిలా కదలిక లేకుండా అయిపోయింది; ఎప్పుడూ తనను పిలుస్తూండే లోకానికి పరుగుతీసింది. ఆమె కళ్ళ నీలపు మడుగులు నిర్జీవంగా తేజోవిహీనంగా కనిపించాయి. సాధువులు తమ చేతనను భౌతిక శరీరంలోంచి తొలగించినప్పుడు తరచు ఈ మాదిరిగా అవుపిస్తూ ఉంటుంది; అప్పుడా శరీరం ఆత్మరహితమైన మట్టిముద్దకు మించి ఉండదు. మే మిద్దరం సమాధి స్థితిలో ఒక గంటసేపు కూర్చుని ఉన్నాం. ఒక చిన్నహాస రేఖతో ఆవిడ ఈ లోకానికి తిరిగి వచ్చింది.

“ఆనందమయి మా, దయ ఉంచి నాతోబాటు తోటలోకి రండి. రైట్‌గారు ఫొటోలు తీసుకుంటారు.”

“అలాగే బాబా. నీ ఇష్టమే నా ఇష్టం.” ఆవిడ చాలా ఫొటోలకు నించున్నప్పుడు, ఆవిడ కళ్ళలో మార్పులేని దివ్యతేజస్సు అలాగే ఉండిపోయింది.

విందుకు వేళ అయింది! ఆనందమయి మాత తన గొంగడి ఆసనం మీద కూర్చుంది. ఆమెకు అన్నం తినిపించడానికి పక్కనే ఒక శిష్యురాలు. పసిపిల్ల మాదిరిగా ఆ సాధ్వి, శిష్యురాలు నోటికి అన్నం ముద్ద అందించినప్పుడు అణకువగా మింగింది. ఆనందమయి మాత, కూరలకీ మిఠాయిలకీ తేడా ఏమీ గుర్తించలేదని స్పష్టమయింది.

పొద్దు కుంకుతుండగా ఆ సాధ్వి తన బృందంతో బయలుదేరి