పుట:Oka-Yogi-Atmakatha.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

ఒక యోగి ఆత్మకథ

“బాబూ, ఆ అజ్ఞాని మాటలు చెవిని పెట్టకు. నీ ప్రార్థనకి జవాబుగా, ఈ జన్మలో నీకు నిర్ణయమయిన ఏకైక మార్గం సన్యాసమేనని నీకు నమ్మకంగా చెప్పమని భగవంతుడు నాతో అంటున్నాడు.”

కచ్చితమైన పరిష్కారంలా వచ్చిన ఈ సందేశాన్ని వినగానే నాకు ఆశ్చర్యమే కాదు - కృతజ్ఞతాభావం కూడా పెల్లుబికింది. సంతోషంగా చిరునవ్వు నవ్వాను.

“ఆ మనిషి దగ్గర్నించి వచ్చెయ్యి!” అంటూ ముంగిట్లోంచి “అజ్ఞాని” నన్ను పిలుస్తున్నాడు. ఋషితుల్యుడయన నా మార్గదర్శకుడు ఆశీర్వాద సూచకంగా చెయ్య ఎత్తి మెల్లగా వెళ్ళిపోయాడు.

“నువ్వెంత పిచ్చివాడవో ఆ సాధువు అంత పిచ్చివాడు.” ఇంత మనోహరమైన వ్యాఖ్య చేసినవాడు తల నెరిసిన పండితుడు. ఆయనా, ఆయన కొడుకూ నా వేపు సానుతాపంగా చూస్తున్నారు. “అతను కూడా దేవుడికోసం అనిశ్చితమైన అన్వేషణలో పడి ఇల్లు విడిచిపెట్టేశాడని విన్నాను.”

నేను ఆ వేపునుంచి తిరిగిపోయాను. ఈ ఇంటివాళ్ళతో నే నింకేమీ మాట్లాడదలుచుకోలేదని అన్నయ్యతో చెప్పేశాను. దాంతో అతను నిరుత్సాహపడి, వెంటనే వెళ్ళిపోవడానికి ఒప్పుకొన్నాడు. వెంటనే మేము కలకత్తా వెళ్ళే రైలు ఎక్కాం.

“డిటెక్టివుగారూ, నేను ఇద్దరు స్నేహితులతో కలిసి పారిపోయానని మీరు ఎలా కనిపెట్టారూ?” అని అడుగుతూ, సరదాగా నాకు కలిగిన ఆసక్తిని మా తిరుగు ప్రయాణంలో అన్నయ్యదగ్గర బయటపెట్టాను. అతను కొంటెగా నవ్వాడు.

“మీ బళ్ళో, అమర్ క్లాసులోంచి వెళ్ళిపోయాడనీ మళ్ళీ రాలేదనీ,