పుట:Oka-Yogi-Atmakatha.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

61

తెలిసింది. మర్నాడు పొద్దున వాళ్ళింటికి వెళ్ళి, గుర్తులు పెట్టిన రైల్వే టైమ్ టేబులు బయటికి లాగాను. సరిగ్గా అప్పుడే, అమర్ వాళ్ళ నాన్నగారు బండిలో బయటికి వెళ్ళబోతూ బండివాడితో మాట్లాడుతున్నారు.

“మా అబ్బాయి ఈ పూట బడికి వెళ్ళడానికి నాతో రాడు. మాయమైపోయాడు!” అంటూ బాధగా అన్నారాయన.

“మీ అబ్బాయిగారూ మరో ఇద్దరూ తెల్ల దొరల బట్టలు వేసుకుని హౌరా స్టేషనులో రైలెక్కారని నాకు తెలిసిన బండివాడు చెప్పగా విన్నానండి. వారి తోలు బూట్లు బండివాడికి బహుమతిగా ఇచ్చారట కూడా!” అన్నాడు ఆ బండివాడు.

“దాంతో నాకు మూడు ఆధారాలు దొరికాయి. టైమ్ టేబులూ, ముగ్గురు కుర్రాళ్ళూ, ఇంగ్లీషువాళ్ళ దుస్తులూ.”

ఉల్లాసమూ విసుగుదలా కలిసిన మనస్సుతో, అన్నయ్య బయట పెట్టే సంగతులు వింటున్నాను. బండివాడి విషయంలో మేము చూపించిన ఔదార్యం కొద్దిలో అస్థానపతితమైందన్నమాట.”

“నేను వెంటనే వెళ్ళి టైమ్ టేబుల్‌లో అమర్, గీతలు పెట్టిన ఊళ్ళ స్టేషను మాస్టర్లందరికి టెలిగ్రాములు ఇచ్చాననుకో,” అంటూ చెబుతూ పోయాడు అన్నయ్య. “బెరైలీ దగ్గర టిక్కు పెట్టాడు అతను. అంచేత, అక్కడున్న మీ స్నేహితుడు - ద్వారకకి తంతి ఇచ్చాను తరవాత, కలకత్తా చుట్టు పక్కల వాకబు చేసిన మీదట తెలిసింది ఏమిటంటే మన జతీన్‌దా ఒకరోజు రాత్రల్లా ఇంటికే రాలేదనీ, మర్నాడు పొద్దున యూరోపియన్ వేషంలో దిగాడనీ తెలిసింది. వాణ్ణి వెతికి పట్టుకుని, భోజనానికి రమ్మని పిలిచాను. నేనొక స్నేహితుడి మాదిరిగా పిలిచేసరికి వాడు కాదనలేక ఒప్పుకొన్నాడు. దారిలో, వాడికి ఏ మాత్రం అనుమానం