పుట:Oka-Yogi-Atmakatha.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

59

లేవు! ప్రాపంచిక అనుభవాలు పొందనిదే నీ పూర్వకర్మ[1]ను ఒక్క నాటికి తప్పించుకోలేవు,” అన్నాడాయన.

అందుకు సమాధానంగా, భగవద్గీత[2]లో చెప్పిన అమృత వాక్కులు నా నోటినుంచి వెలువడ్డాయి. “ఎంతో దుష్కర్మ మూటగట్టుకున్నవాడు కూడా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లయితే, అతడు వెనక చేసిన దుష్కర్మల ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడయి శాశ్వత శాంతి నందుకుంటాడు. నన్ను నమ్ముకున్న భక్తు డెవడూ నశించడు. ఇది నిశ్చయమని తెలుసుకో!”

అయితే ఆ యువకుడు అంత గట్టిగా జోస్యం చెప్పేసరికి నాలో విశ్వాసం కొద్దిగా సడలింది. అప్పుడు గుండెనిండా భక్తి నింపుకొని మనస్సులో దేవుణ్ణి ఇలా ప్రార్థించాను:

“దయ ఉంచి నా మానసిక ఆందోళన పోగొట్టు- ఇక్కడే, ఇప్పుడే జవాబు చెప్పు- నన్ను సన్యాసిగా బతకమంటావా, సంసారిగానా? నీ ఉద్దేశం చెప్పు”

ఈ పండితుడుగారి ఇంటి ఆవరణకు వెలువల ప్రసన్న వదనుడయి ఉన్న ఒక సాధువును గమనించాను. దివ్యదృష్టి కలవాణ్ణని చెప్పుకొనే ఈయనకూ నాకూ తీవ్రంగా జరిగిన సంభాషణను ఆయన వినే ఉంటా

డన్నది- నన్ను తన దగ్గరికి పిలవడంతో అర్థమయింది. ప్రశాంతమైన ఆయన కళ్ళలోంచి బ్రహ్మాండమైన శక్తి ఒకటి వెలువడుతున్నట్టు నాకు అనుభూతి కలిగింది.

  1. ఈ జన్మలో కాని, పూర్వజన్మలో కాని చేసిన వెనకటి పనులకు ఫలితాలు; ‘చేయడం’ అనే అర్థంలో, ‘కృ’ అనే సంస్కృత ధాతువునుంచి వచ్చింది -
  2. అధ్యా. 9 : శ్లో. 30-31.