పుట:Oka-Yogi-Atmakatha.pdf/780

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

744

ఒక యోగి ఆత్మకథ

“ఇంక తిట్టను,” అన్నారాయన. ఆయన దివ్యస్వరంలో, గుప్తంగా, నవ్వు ఉన్నప్పటికీ ఆ స్వరం గంభీరంగా ఉంది. “మన రూపాలు రెండూ భగవంతుడి మాయాస్వప్నంలో వేరువేరుగా కనిపించినంత కాలం, నువ్వూ నేనూ కలిసి చిరునవ్వు నవ్వుకుంటాం. చివరికి మనం ఒకరమై విశ్వప్రియతముడిలో లీనమవుతాం; మన చిరునవ్వులు ఆయన చిరునవ్వు లవుతాయి; మన సమైక్య ఆనందగీతం అనంతమంతటా స్పందిస్తూ, దైవానుసంధానం పొందిన ఆత్మలకు ప్రసారమవుతూ ఉంటుంది!”

శ్రీయుక్తేశ్వర్‌గారు కొన్ని ఇతర విషయాలు కూడా వివరించారు; కాని వాటిని నే నిక్కడ వెల్లడించలేకపోతున్నాను. బొంబాయి హోటలు గదిలో ఆయన నాతో గడిపిన రెండు గంటలలోనూ నే నడిగిన ప్రతి ప్రశ్నకూ జవాబు ఇచ్చారు. 1936 జూన్‌లో, ఆనాడు ఆయన ప్రపంచ భవిష్యత్తు గురించి పలికిన జోస్యాలు, కొన్ని ఈపాటికే ఫలించాయి.

“బాబూ, ఇప్పుడింక నిన్ను విడిచి వెళ్ళిపోవాలి మరి!” ఈ మాటలు వినడంతోటే, నేను చుట్టి ఉంచిన చేతుల్లో గురుదేవులు కరిగి పోతున్నట్టు అనిపించింది.

“నాయనా,” అంటూ పిలిచినప్పుడు ఆయన కంఠస్వరం, నా ఆత్మాకాశంలోకి స్పందిస్తూ ప్రవేశించింది: “నువ్వు నిర్వికల్ప సమాధి ద్వారంలోకి ప్రవేశించి నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఇవాల్టి లాగే, రక్తమాంసాలున్న శరీరంతో నీ దగ్గరికి వస్తాను,” అన్నారాయన.

ఈ దివ్యవాగ్దానం చేసి శ్రీయుక్తేశ్వర్‌గారు నాకు కనుమరుగయి పోయారు. సంగీతంతో కూడిన ఉరుములా మారుమోగిన మేఘ గర్జన స్వరం ఒకటి ఇలా పలికింది: “అందరికీ చెప్పు! మీ భూలోకం దేవుడి కల అని నిర్వికల్ప సమాధిలో తెలుసుకున్న వాడల్లా హిరణ్యలోకమనే