పుట:Oka-Yogi-Atmakatha.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

55

ఆ మనిషి ఖాతరు చేయ్యలేదు. అతని మీదపడి పట్టుకోడానికి మేము పరిగెత్తాం. అతని వెనకాలకి వెళ్ళి నా గొడ్డలితో, మంచి బలంగా ఒక్క వేటు వేశాను. దాంతో అతని కుడిచెయ్యి దాదాపు పూర్తిగా ఊడిపడేటంతగా తెగిపోయింది.

“నోరు విప్పి అరవడం కాని, దారుణమైన ఆ దెబ్బవేపు చూడ్డం కాని చెయ్యకుండా, ఆ మనిషి ఇంకా చురుగ్గానే నడిచిపోతూండడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మేము ఆయన ఎదటికి ఉరికేసరికి, నిదానంగా ఇలా అన్నాడు:

“మీరు గాలిస్తున్న ఖూనీకోరు నేను కాదు.”

“దేవుడిలాటి ఒక ఋషిని గాయపరిచానని తెలిసేసరికి అవమానంతో కుంగిపోయాను. ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకొని, పెద్ద ధారగా చిమ్ముతున్న రక్తాన్ని అరికట్టడానికి నా తలపాగా తీసి ఇచ్చాను.

“నాయనా, ఇది నీ వల్ల పొరపాటున జరిగిందని తెలుస్తోంది.” అంటూ ఆ సాధువు నా మీద దయతో ఇలా అన్నాడు: ‘వెళ్ళు; నిన్ను నువ్వు తిట్టుకోకు. ప్రేమమయురాలయిన ఆ జగన్మాత నన్ను జాగ్రత్తగా చూసుకుంటోందిలే!’ వేలాడుతున్న చేతిని మొండి భుజంలోకి తోశాడాయన. ఆశ్చర్యం! అది వెంటనే అతుక్కుపోయింది; రక్తస్రావం కూడా చిత్రంగా ఆగిపోయింది.

“మూడు రోజులు పోయాక నా దగ్గరికి రండి- అదుగో, ఆ చెట్టు కింద ఉంటాను; గాయం పూర్తిగా మానిపోవడం మీరే చూస్తారు. అప్పుడిక మీరు పశ్చాత్తాపపడనక్కర్లేదు.”

“నిన్న నేనూ, నాతోబాటు పనిచేసే ఆఫీసరూ కలిసి ఆయన