పుట:Oka-Yogi-Atmakatha.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

ఒక యోగి ఆత్మకథ

చెప్పిన చోటికి ఆత్రంగా వెళ్ళాం. సాధువు అక్కడ ఉన్నాడు. తన చెయ్యి పరీక్షగా చూడనిచ్చాడు మమ్మల్ని. దాని మీద ఒక మచ్చా లేదు, గాయమయిన జాడా లేదు!”

“నేను ఋషీకేశం మీదగా హిమాలయ నిర్జన ప్రదేశాలకి వెడుతున్నాను. అంటూ ఆ సాధువు తొందరగా బయలుదేరి వెళ్తూ మమ్మల్ని దీవించాడు. ఆయన పవిత్రతవల్ల నా జీవితం ఉచ్చస్థితి నందుకున్నట్టు అనిపిస్తోంది.”

ఆ అధికారి ఎంతో భక్తి ఉట్టిపడేలా తన మాటలు ముగించాడు; ఆయనకు కలిగిన అనుభవం, ఆయన్ని సమూలంగా కదిలించినట్లు కనిపిస్తోంది. ఆ విషయం మా మసస్సుల కెక్కే విధంగా ఆయన, అద్భుతమయిన ఆ వార్త పత్రికలో అచ్చయిన కాయితం ఒకటి నా చేతికిచ్చాడు. జనంలో సంచలనం కలిగించడానికే ప్రాముఖ్యమిచ్చే వార్తాపత్రికను (దురదృష్టవశాత్తు, భారతదేశంలో కూడా ఇవి లేకపోలేదు) మామూలయిన స్వానుకూలపద్ధతిలో అతిశయోక్తిగా రాశారు. అందులో: దాదాపు ఆ సాధువు తల తెగ్గొట్టినంత పని జరిగిందని సూచించారు.

తనను పీడించినవాణ్ణి క్రీస్తు మాదిరిగా క్షమించగలిగేటంతటి ఒక మహాయోగి దర్శనాన్ని పోగొట్టుకున్నందుకు నేను అమరూ విచారించాం. భారతదేశం, గత రెండు శతాబ్దులుగా, భౌతిక సంపత్తి విషయంలో పేదగానే ఉన్నప్పటికీ తరగని గనివంటి దివ్య సంపత్తి మాత్రం దానికి ఉంది; ఈ పోలీసాయనవంటి లౌకిక మానవులకు కూడా, ఆధ్యాత్మికంగా “ఆకాశాన్నంటే మేడలు,” సందర్భవశాత్తు దారి పక్కనే ఎదురు పడుతుంటాయి.

అటువంటి అద్భుతమైన కథ చెప్పి మా విసుగు పోగొట్టినందుకు ఆ అధికారికి మేము ధన్యవాదాలు చెప్పాం. తాము మాకంటే అదృష్టవంతు