పుట:Oka-Yogi-Atmakatha.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

ఒక యోగి ఆత్మకథ

అనంతన్నయ్య ఎలాగా మా యూరోపియన్ వేషం పసిగట్టేశాడు కనక, మేము చేసిన మొట్టమొదటి పని, బట్టలు మార్చేసి దేశవాళీ దుస్తులు వేసుకోడం. పట్టుబడిపోతామన్న కించ నా మనస్సులో పీకుతూనే ఉంది.

వెంటనే హరిద్వారం విడిచి వెళ్ళిపోవడం మంచిదని, అక్కడికి ఉత్తరాన ఉన్న ఋషీకేశం వెళ్ళడానికి టిక్కెట్లు కొనుక్కున్నాం. చిరకాలంగా ఎంతోమంది మునీశ్వరుల పాదస్పర్శతో పునీతమైన భూమి ఋషీకేశం. అప్పటికే నేను బండి ఎక్కేశాను; అమర్ మాత్రం వెనకబడి, ఇంకా ప్లాట్‌ఫారంమీదే ఉన్నాడు. ఒక పోలీసు కేకలో వాడు ఠకీమని అక్కడాగిపోయాడు. మాకు ఇష్టంలేకపోయినా మా సంరక్షకుడిగా వెంటదగిలిన ఆ పోలీసు అధికారి, మమ్మల్ని ఒక పోలీసు స్టేషను బంగళాకు నడిపించి, మా దగ్గర ఉన్న డబ్బు స్వాధీనం చేసుకున్నాడు. మా అన్నయ్య వచ్చేదాకా మమ్మల్ని అక్కడ ఆపుచేసి ఉంచడం తన విధి అని మర్యాదగా చెప్పాడు.

తప్పించుకు తిరుగుతున్న మేము చేరదలచిన గమ్యం హిమాలయాలని తెలిసి ఆ అధికారి ఒక విచిత్రమైన కథ చెప్పాడు.

“సాధువులంటే మీకేదో వెర్రి వ్యామోహం ఉన్నట్టు కనిపిస్తోంది. నిన్ననే నే నొక సాధువును చూశాను; ఆయనకంటె గొప్పవాణ్ణి మీ రెన్నటికీ చూడలేరు. నేనూ, నాతో పనిచేసే మరో ఆఫీసరూ, ఐదురోజుల క్రితం మొదటిసారిగా ఆయనకి తారసపడ్డాం. ఒక ఖూనీకోరు కోసం తీవ్రంగా గాలిస్తూ గంగ ఒడ్డున పహరా కాస్తున్నాం మేము. వాడు బతికుండగానన్నా సరే, చచ్చినా సరే పట్టి తెమ్మని మాకు హుకుము జారీ అయింది. యాత్రికుల్ని దోచుకోడానికి వాడు సాధువులా మారువేషాలు వేస్తాడని పేరు. మాకు కొంచెం దూరంలో, ఆ నేరస్తుడి పోలికలకు సరిపోయే మనిషి ఒకడు కనిపించాడు. ఆగమని మేము హెచ్చరిక చేసినా