పుట:Oka-Yogi-Atmakatha.pdf/724

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

688

ఒక యోగి ఆత్మకథ

డప్పుడు ఆయన వేపు చూస్తూ, ఆయన సంతోషిస్తున్నట్టు కనిపిస్తున్నారని భావించాను.

ఆ తరవాత, శ్రీరాంపూర్ కాలేజి పూర్వవిద్యార్థుల సభలో ప్రసంగించవలసి వచ్చింది. నేను పాత సహాధ్యాయుల్ని చూస్తుంటేను, వాళ్ళు తమ “పిచ్చి సన్యాసి”ని చూస్తుంటేను ఆనంద బాష్పాలు స్రవించాయి.[1] ధారాళమైన వాగ్ధాటిగల మా తత్త్వశాస్త్రాచార్యులు, డా॥ ఘోషాల్ గారు, నన్ను అభినందించడానికి ముందుకు వచ్చారు; కాలమనే రసవాది వల్ల వెనకటి మా అపార్థాలన్నీ తొలగిపోయాయి.

డిసెంబరు నెల చివరిలో శ్రీరాంపూర్ ఆశ్రమంలో చలికాలపు సంక్రమణోత్సవం జరిగింది. ఎప్పటి మాదిరిగానే, శ్రీయుక్తేశ్వర్‌గారి శిష్యులు ఎక్కడెక్కడివాళ్ళూ అక్కడ సమకూడారు. భక్తి సంకీర్తనలూ అమృతంలాంటి తియ్యటి గొంతులో క్రిష్టోదా ఒక్కడూ పాడిన పాటలూ కుర్ర విద్యార్థులు వడ్డించిన విందు భోజనమూ కిటకిటలాడే ఆశ్రమ ప్రాంగణంలో ఆరుబయట నక్షత్రాల కింద గాఢంగా సంచలనాత్మకమైన గురుదేవుల ఉద్బోధా - ఎన్నెన్ని జ్ఞాపకాలు! ఎప్పుడో గతించిన ఏళ్ళ ఆనంద మహోత్సవాలు! అయితే, ఈ రోజు రాత్రి ఒక కొత్త విశేషం ఉంది.

“యోగానందా, ఈ సమావేశంలో నువ్వు ఇంగ్లీషులో మాట్లాడు.” ఇబ్బడిగా అసామాన్యమైన ఈ కోరిక కోరుతుంటే, గురుదేవుల కళ్ళు మిల

  1. పరమహంసగారి మహాసమాధి తరవాత, శ్రీరాంపూర్ కాలేజి ప్రిన్సిపాలు డా॥ సి. ఇ. అబ్రహాంగారు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు రాసిన ఉత్తరంలో ఇలా అన్నారు: “స్వామివారికి శ్రీరాంపూర్ కాలేజీ మీద గొప్ప అభిమానం ఉండేదని నాకు తెలుసు; యోగానంద స్కాలర్‌షిప్, ఈ యథార్థానికి తగిన స్మారక చిహ్నంగా నిలుస్తుంది.” (ప్రచురణకర్త గమనిక).