పుట:Oka-Yogi-Atmakatha.pdf/723

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

687

“గురూజీ, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు, కాని ఆ మాట మీరు చెప్పగా వినాలని నా చెవులు తపించిపోతున్నాయి.”

“నువ్వు కోరుకున్నట్టే కానియ్యి. వైవాహిక జీవితంలో ఉన్న రోజుల్లో నేను, యోగమార్గంలో తర్ఫీదు ఇయ్యడానికి, నాకు ఒక్క కొడుకు ఉంటే బాగుండునని నేను తరచు తపిస్తూ ఉండేవాణ్ణి. కాని నువ్వు నా జీవితంలో అడుగు పెట్టాక తృప్తిపడ్డాను; నీ లోనే నా కొడుకును చూసుకున్నాను.” శ్రీయుక్తేశ్వర్‌గారి కళ్ళలో స్పష్టంగా రెండు కన్నీటిబొట్లు నిలిచాయి. “యోగానందా, నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను.”

“మీ సమాధానమే నాకు స్వర్గప్రవేశానికి అనుమతి పత్రం.” ఆయన మాటలకు నా గుండెలో బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఆయన భావావేశరహితంగా, కుదురుగా ఉంటూండేవారని నాకు తెలుసు; అయినా, ఆయన మౌనానికి నేను తరచు ఆశ్చర్యపోతూ ఉండేవాణ్ణి. ఆయన్ని నేను పూర్తిగా తృప్తిపరచలేకపోయానేమోనని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాణ్ణి. ఆయనది చిత్రమైన స్వభావం; ఎప్పుడూ పూర్తిగా తెలిసేది కాదు; బయటి ప్రపంచానికి అందనంత లోతుగా, నిశ్చలంగా ఉండేది ఆయన ప్రకృతి. ఆ బయటి ప్రపంచం విలువల్ని ఆయన ఏనాడో అధిగమించారు.

తరవాత కొన్నాళ్ళకి నేను కలకత్తాలో ఆల్బర్ట్ హాల్లో అసంఖ్యాకులైన శ్రోతల నమక్షంలో ఒక సభలో ప్రసంగించాను. శ్రీయుక్తేశ్వర్‌గారు, సంతోష్ సంస్థానం మహారాజా, కలకత్తా మేయర్‌లతో బాటు సభావేదిక మీద కూర్చోడానికి అంగీకరించారు. గురుదేవులు నా దగ్గర వ్యాఖ్యానమేమీ చెయ్యలేదు; కాని ప్రసంగ సమయంలో నేను అప్పు