పుట:Oka-Yogi-Atmakatha.pdf/719

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణ భారత విహారయాత్ర

683

ఈ చేతిని జోడించారు. అప్పుడు ఆ సర్దారు, తనకు ఆధ్యాత్మిక ఉపదేశం ఏమైనా చెయ్యమని సదాశివబ్రహేంద్రుల్నీ కోరగా, వేలితో ఇసకలో ఇలా రాసి చూపించారు:

“నువ్వు కోరేది చెయ్యకు; అప్పుడు నీకు నచ్చేది చెయ్యవచ్చు.”

పరిశుద్ధ మనఃస్థితిని అందుకున్న వాడై ఆ ముస్లిం, పరస్పర విరుద్ధమైన ఈ సలహా, అహంకారాన్ని జయించడం ద్వారా ఆత్మవిముక్తి పొందడానికి దారి చూపిస్తుందన్న సంగతి అర్థం చేసుకున్నాడు. ఈ కొద్ది మాటల ఆధ్యాత్మిక ప్రభావం ఎంత గొప్పగా పనిచేసిందంటే, ఆ తరవాత ఆ యోధుడు యోగ్యుడైన శిష్యుడనిపించుకొన్నాడు; అతని పాత అలవాట్లన్నీ పటాపంచలయి పోయాయి.

ఒకసారి ఊళ్ళో పిల్లలు, అక్కడికి 150 మైళ్ళ దూరంలో మధురలో జరిగే ఉత్సవం ఒకటి చూడాలని ముచ్చటగా ఉందని సదాశివుల దగ్గర ఆన్నారు. అప్పుడా యోగి, తమ ఒంటిని ముట్టుకోమని ఆ పిల్లలతో అన్నారు. అంతే! మొత్తం వాళ్ళందరూ కట్టకట్టుకుని ఒక్క క్షణంలో మధురకు రవాణా అయిపోయారు. ఆ ఉత్సవానికి వచ్చిన వేలాది యాత్రికుల మధ్య హాయిగా తిరిగారు వాళ్ళు. కొద్ది గంటల్లో ఆ యోగి, తన వర్దీలో ఉన్న ఆ పిల్లల్ని మళ్ళీ, తమ సులభ ప్రయాణపద్ధతిలో ఇళ్ళకి చేర్చారు. మధురలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు గురించి పిల్లలు స్పష్టంగా చెప్పడం విని, చాలామంది పిల్లల చేతుల్లో మధుర మిఠాయి పొట్లాలు ఉండడం చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.

నమ్మకంలేని ఒక యువకుడు, ఆ సాధువునూ ఆయన కథనూ గేలిచేశాడు. తరవాత ఒక సందర్భంలో శ్రీరంగంలో ఉత్సవం జరుగుతుందని తెలిసి, సదాశివబ్రహ్మేంద్రుల్ని కలుసుకున్నాడతను.