పుట:Oka-Yogi-Atmakatha.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

ఇది అత్యుత్తమమైనదని నా నిశ్చితాభిప్రాయం ; ఇటువంటిది పాశ్చాత్య దేశాల్లో ఇంతవరకు ఎన్నడూ ప్రచురితం కాలేదు.

ఇందులో వర్ణించిన ఋషుల జీవిత చరిత్రల్లో శ్రీయుక్తేశ్వర్ గారిది ఒకటి ; నాకు వారి పరిచయభాగ్యం కలిగింది. 'టిబెటన్ యోగ ఆండ్ సీక్రెట్ డాక్ట్రిన్స్‌'[1] అన్న పుస్తకం ముఖపత్రంలో ఒక భాగంగా, పూజనీయులైన ఆ సాధుపుంగవుల ఛాయాచిత్రం కూడా ముద్రించడం జరిగింది. శ్రీయుక్తేశ్వర్‌గారిని నేను కలుసుకొన్నది, బంగాళాఖాత తీరంలోని ఒరిస్సా రాష్ట్రంలో, పూరీ నగరంలో అప్పటికే ఆయన, సాగర తీరాన ప్రశాంతమైన ఒక ఆశ్రమానికి ఆధిపతులు ; యువక శిష్య బృందానికి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడం ఆయన ప్రధాన వ్యాపకం.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ, ఉత్తర దక్షిణ అమెరికాల్లోనూ, ఇంగ్లండులోనూ కూడా ఉన్న ప్రజల సంక్షేమంపట్ల ఆయనకు గాఢమైన ఆసక్తి ఉంది. దూరప్రాంతాల్లో జరిగే కార్యకలాపాల గురించి, ముఖ్యంగా కాలిఫోర్నియాలో తమ ముఖ్యశిష్యులైన పరమహంస యోగానందగారు నిర్వహించే కార్యకలాపాల గురించి నన్ను అడిగారు. యోగానందగారిని ఆయన ఎంతగానో ప్రేమించేవారు ; పాశ్చాత్య దేశాలకు తమ దూతగా, 1920 లో ఈయన్ని పంపింది వారే.

శ్రీ యుక్తేశ్వర్‌గారు సాధుస్వరూపులు: ఆయన ఉనికే ఆహ్లాదం కలిగించేది. తమ అనుచరులు స్వచ్ఛందంగా చూపే గౌరవానికి ఆయన ఎంతో తగినవారు. ఆయన్ని ఎరిగిన ప్రతి వ్యక్తి - ఆ వ్యక్తి ఏ జాతి

వాడయినా సరే - ఆయన్ని అపరిమిత గౌరవప్రపత్తులతో చూసేవాడు. నాకు స్వాగతం చెప్పడానికి ఆశ్రమ ప్రవేశద్వారం దగ్గర నించున్నప్పటి,

  1. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1958.