పుట:Oka-Yogi-Atmakatha.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9

ఆయన రూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్టు ఉంది. ఆయన మంచి ఎత్తరి ; నిటారుగా నిలిచే వ్యక్తి. ప్రాపంచిక తాపత్రయాలన్నీ విడిచి పెట్టేసినవారు. కాషాయం వన్నె బట్టలు కట్టుకొన్న సాధుమూర్తి ఆయన. ఆయన జుట్టు పొడుగ్గా, కొంతవరకు వంకులు తిరిగి ఉంటుంది. శరీరం మాంసలమై దృఢంగానే ఉంటుంది కాని, సన్నగా, సౌష్ఠవంగా ఉంటుంది. ఆయన అడుగులో మంచి ధాటి ఉంది. ఆయన నివాసస్థానంగా ఎన్నుకున్నది, పవిత్రమైన పూరీ నగరం ; ధార్మికులైన హిందువులు, భారత దేశంలో ప్రతి రాష్ట్రం నుంచీ, ప్రసిద్ధమైన “జగన్నాథ” స్వామి ఆలయాన్ని దర్శించడానికి ప్రతి రోజూ ఆసంఖ్యాకంగా యాత్రకు వస్తారు.

జన్మ కృతార్థంగా ముగిసేటట్టు సాగిందని తెలిసిన శ్రీయుక్తేశ్వర్ గారు 1936 లో జీవన్మరణాలనే పరివర్తనశీలమైన స్థితిలో గోచరించే దృశ్యాల మీంచి చూపు మళ్ళించి, భౌతికంగా కన్ను మూసింది పూరీలో.

శ్రీయుక్తేశ్వర్‌గారి సచ్చీరాన్నీ పవిత్రతనూ ధ్రువపరుస్తూ రాయగలిగినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఆయన శిష్యులు పరమహంస యోగానందగారు ఇప్పుడు, యుగయుగాలవారి కోసం ఆయనను గురించి అభివర్ణించారు ; యుక్తేశ్వర్‌గారు జనబాహుళ్యానికి దూరంగా ఉండడంతో తృప్తిపడి, యోగానందగారు వివరించినట్టుగా, శక్తివంచన లేకుండా, ప్రశాంతంగా ఆదర్శ జీవితానికి అంకితమైనవారు.

డబ్ల్యు. వై . ఇవాన్స్ - వెంట్జ్‌