పుట:Oka-Yogi-Atmakatha.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతం

డబ్ల్యు. వై. ఇవాన్స్ - వెంట్జ్ , ఎం.ఏ., డి.లిట్ ., డి.ఎస్.సి "

జీసన్ కాలేజి, ఆక్స్‌ఫర్డ్;

ది టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్;

టిబెట్స్ గ్రేట్ యోగి మిలరెపా,

టిబెటన్ యోగ అండ్ సీక్రెట్' డాక్ట్రిన్స్,

మొదలైన గ్రంథాల రచయిత

యోగానందగారి 'ఆత్మకథ', భారతదేశపు జ్ఞానసంపన్నుల గురించి ఇంగ్లీషులో వచ్చిన కొద్ది పుస్తకాల్లో ఒకటి కావడంవల్లా, అది కూడా ఒక పత్రికా రచయితో విదేశీయుడో రాసింది కాకుండా, ఆ జాతి ప్రజల్లోనే ఒకరై పుట్టి పెరిగి, శిక్షణపొంది— టూకీగా చెప్పాలంటే— యోగుల గురించి ఒక యోగే స్వయంగా రాసిన పుస్తకం కావడం వల్లా దీని విలువ ఘనంగా పెరిగింది. ఆధునిక హిందూ సాధువుల అసాధారణ జీవితాలకూ శక్తులకూ ఒక ప్రత్యక్ష సాక్షి కథనమయిన ఈ గ్రంథానికి సకాలికతా నిష్కాలికతా కూడా సమకూరిన ప్రాముఖ్యం ఉంది. ఈ విశిష్ట రచయితతో భారతదేశంలోనూ అమెరికాలోనూ కూడా నాకు పరిచయ భాగ్యం కలిగింది ; ప్రతి పాఠకుడూ ఈయనకు సముచిత ప్రశంస, కృతజ్ఞత తెలుపుకోవాలి. అసామాన్యమైన ఈయన జీవిత వృత్తాంత గ్రంథం, హైందవ మనస్సునూ హృదయాన్నీ భారతదేశపు ఆధ్యాత్మిక సంపత్తినీ లోతులు తరిచి బహిర్గతం చేసింది ; ఆ మాదిరి గ్రంథాల్లో