పుట:Oka-Yogi-Atmakatha.pdf/659

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గులాబీలమధ్య సాధువు, లూథర్ బర్బాంక్

623

ఈ సత్పురుషుని దగ్గర నేను సెలవు తీసుకుంటూ ఉండగా, ఆయన ఒక చిన్న పుస్తకం మీద సంతకంపెట్టి, దాన్ని నాకు బహూకరించారు.[1]

“ఇదుగో, ‘ది ట్రెయినింగ్ ఆఫ్ ది హ్యూమన్ ప్లాంట్’[2] (మానవ వృక్ష శిక్షణ) అన్న విషయం మీద నా పుస్తకం,” అన్నారాయన. “శిక్షణలో కొత్త రకాలు - నిర్భయ ప్రయోగాలు అవసరమిప్పుడు. పండ్ల లోనూ పూలలోనూ అత్యుత్తమమైనవాటిని సాధించడంలో, అప్పుడప్పుడు అతిసాహసంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అలాగే, పిల్లలకోసం విద్యాబోధన సంబంధమైన నవకల్పనలు కూడా ఇంకా బహు సంఖ్యాకంగా, సాహసికంగా తయారు కావాలి,” అన్నారు.

ఆయన పుస్తకాన్ని ఆ రోజు రాత్రే గాఢమైన ఆసక్తితో చదివాను. ఆయన కన్ను, మానవజాతికి మహోజ్జ్వలమైన భవిష్యత్తును దర్శిస్తోంది. ఆయన ఇలా రాశారు: “ఈ ప్రపంచంలో అన్నిటికన్న మొండిప్రాణీ మార్చడానికి వీలుకాకుండా ఉండేది, నిశ్చితమయిన కొన్ని అలవాట్లకు స్థిరపడ్డ మొక్క ఈ మొక్క యుగయుగాలుగా తన వ్యక్తిత్వాన్ని

  1. బర్బాంక్‌గారు, సంతకం చేసిన ఫొటో కూడా ఒకటి నాకు ఇచ్చారు. ఒకప్పుడు లింకన్ బొమ్మను అమూల్యంగా భద్రపరచుకున్న హిందూ వర్తకుడిలాగే, నేను దాన్ని భద్రపరుచుకున్నాను. అంతర్యుద్ధాల కాలంలో అమెరికాలో ఉన్న ఆ హిందువుకు లింకన్ మీద ఎంత అభిమానం ఏర్పడిందంటే, ఆ దాస్య విముక్తి ప్రదాత బొమ్మ ఒకటి సంపాదించేవరకు భారతదేశానికి తిరిగి రావడానికి అతనికి మనస్కరించలేదు. న్యూయార్కులో ఉండే డేనియల్ హంటింగ్‌ టన్ అనే ప్రసిద్ధ చిత్రకారుడిచేత ఆయన బొమ్మ వేయించడానికి అనుమతి వచ్చేవరకు కదలనని, ప్రెసిడెంట్ లింకన్ నివాసభవనం దగ్గర భీష్మించుకొని కూర్చున్నాడు. చివరికి ప్రెసిడెంట్ లింకన్ ఆశ్చర్యపోయి అనుమతి ఇచ్చాడు. బొమ్మ పూర్తి అయిన తరవాత ఆ హిందువు, విజయగర్వంతో దాన్ని కలకత్తా తీసుకువెళ్ళాడు.
  2. న్యూయార్క్: సెంచరీ కం., 1922.