పుట:Oka-Yogi-Atmakatha.pdf/660

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

624

ఒక యోగి ఆత్మకథ

నిలుపుకొంటూ వస్తున్న విషయం గుర్తుంచుకోవాలి; బహుశా, అనేక యుగాలకు పూర్వం రాళ్ళలో పుట్టి, సుదీర్ఘ కాలగతిలో కూడా ఏ విధమైన పెద్ద మార్పు చెందకుండా ఉన్నది అదే కావచ్చు. ఇన్ని యుగాల ఆవృత్తిలో, మొక్క, అసమాన దృఢత్వంగల సంకల్పశక్తిని (ఉదాహరణకు అలా చెప్పాలనుకుంటే) అలవరచుకోదంటారా? నిజానికి, కొన్ని రకాల తాటిచెట్లలాంటి మొక్కలు, ఎంతగా మార్పుకు లోనుకాకుండా ఉంటాయంటే, ఇంతవరకూ ఏ మానవశక్తి వాటిని మార్చలేకపోయింది. మొక్క సంకల్ప శక్తితో పోలిస్తే మానవ సంకల్పశక్తి బలహీనమయినది. కాని, మొత్తం మొక్కకున్న యావజ్జీవ దృఢత్వం, కేవలం ఇంకో కొత్త జీవితో దాన్ని కలిపినంత మాత్రాన ఎలా విచ్ఛిన్నమయిందో చూడండి; సంకరకరణంవల్ల దాని జీవితంలో సంపూర్ణమూ శక్తిమంతమూ అయిన మార్పు తీసుకురావడం జరిగింది. దృఢత్వంలో ఆ విచ్ఛిన్నత వచ్చినప్పుడు దాన్ని ఓర్పుగా పర్యవేక్షిస్తూ, ఎంపికచేస్తూ ఆ మార్పును స్థిరపరిస్తే, కొత్తమొక్క కొత్తరీతిగా జీవిస్తుంది; పాతరీతికి తిరిగిపోదు. చివరికి దాని దృఢసంకల్పశక్తి విచ్ఛిన్నమై పరివర్తితమవుతుంది.

“అదే, ఎంతో సంవేదనశీలంగానూ నమ్యంగానూ ఉండే శిశుస్వభావ విషయంలో అయితే సమస్య చాలా తేలికవుతుంది.”

“అమెరికా దేశస్థుడైన ఆ మహానుభావుడివేపు అయస్కాంతంలా ఆకృష్ణుణ్ణి అయి నేను, ఆయన్ని కలుసుకోడానికి మళ్ళీ మళ్ళీ వెళ్తూండే వాణ్ణి. ఒకరోజు పొద్దున నేను వెళ్ళేసరికి పోస్ట్‌మాన్, బర్బాంక్‌గారి అధ్యయనమందిరంలో, దాదాపు వెయ్యి ఉత్తరాలు పెట్టి వెళ్ళాడు. ప్రపంచం నలుమూలలనుంచీ ఉద్యానశాస్త్రజ్ఞులు ఆయనకు ఉత్తరాలు రాశారు.

“స్వామీజీ, మీరుండడంవల్లనే నేను తోటలోకి రావడానికి నాకు