పుట:Oka-Yogi-Atmakatha.pdf/646

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

610

ఒక యోగి ఆత్మకథ

ఆ సమయంలో, మా గుర్పార్ రోడ్డు ఇంటి సింహద్వారం తడుతున్న చప్పుడు వినిపించింది. ఆ పిలుపు అందుకొని తలుపు తీశాను, సన్యాసులు కట్టుకొనే చిన్న అంగోస్త్రం కట్టుకున్న ఒక పడుచాయన ఎదురుగా కనిపించారు; ఇంట్లోకి వచ్చారు.

“ఈయన బాబాజీ అయి తీరాలి!” అనుకుని, దిగ్ర్భమ చెందాను. ఏమంటే, నా ఎదురుగా ఉన్నాయనకి, పడుచుతనంలో ఉన్న లాహిరీ మహాశయుల మొక్కట్లు ఉన్నాయి. ఆయన నా ఊహకు జవాబిచ్చారు. “ఔను. నేను బాబాజీని.” ఆయన మధురంగా హిందీలో మాట్లాడారు. “మన పరమపిత పరమేశ్వరుడు నీ ప్రార్థన విన్నాడు. ‘నీ గురువుగారి ఆదేశాల్ని అనుసరించి ఆమెరికా వెళ్ళు. భయపడకు, నీకు రక్ష ఉంటుంది’ అని నీతో చెప్పమని ఆయన నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు.

స్పందనశీలమైన కొద్దిపాటి విరామం తరవాత, బాబాజీ మళ్ళీ నాతో మాట్లాడారు. “పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి నేను ఎంపిక చేసినవాడివి నువ్వే. చాలాకాలం కిందట, ఒక కుంభమేళాలో నీ గురువు యుక్తేశ్వర్‌ను కలిశాను. నిన్ను ఆయన దగ్గరకి శిక్షణకు పంపుతానని అప్పుడు ఆయనకి చెప్పాను.”

నాకు నోట మాట లేదు; ఆయన ఉనికికి భయభక్తులతో ఉక్కిరి బిక్కిరి అయి, నన్ను శ్రీయుక్తేశ్వర్‌గారి దగ్గరికి పంపినవారు ఆయనేనని ఆయన నోటినించే విన్నందుకు గాఢంగా చలించిపోయారు. ఆ అమర గురువుల పాదాలముందు సాష్టాంగపడ్డాను. కృపాదృష్టితో ఆయన నన్ను లేవదీశారు. నా జీవితాన్ని గురించి అనేక విషయాలు చెప్పి, కొన్ని ఆంతరంగిక సూచనలు ఇచ్చి, భవిష్యత్తులో జరగబోయే కొన్ని రహస్య విషయాలు వెల్లడించారు.

“దైవసాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన