పుట:Oka-Yogi-Atmakatha.pdf/625

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్య ప్రపంచం గురించి బాబాజీ ఆసక్తి

589

పాటించి ఒక చెట్టు దగ్గరికి వచ్చాను. ఆ చెట్టు కొమ్మల నీడన, ఆకర్షకమైన శిష్యబృందంతో ఉన్న ఒక గురువుగారిని చూశాను. మిలమిల మెరిసే నల్ల కళ్ళతో, తేజస్వంతమైన అసాధారణ విగ్రహం గల ఆ గురువుగారు, నేను వస్తూండగా లేచి నించుని నన్ను కావలించుకున్నారు.”

“ ‘స్వాగతం, స్వామీజీ,’ అన్నారాయన ఆప్యాయంగా.”

“ ‘అయ్యా, నేను స్వామిని కానండి,’ అని ఒత్తి పలికాను.”

“ ‘స్వామి అన్న బిరుదు ఎవరికి ఇమ్మని దైవపరంగా నాకు ఆదేశం వచ్చిందో వాళ్ళు దాన్ని పరిత్యజించరు.’ ఆయన నాతో సౌమ్యంగానే మాట్లాడారు కాని, ఆయన మాటల్లో గాఢమైన సత్యనిష్ఠ ధ్వనించింది. తక్షణమే ఒకానొక ఆధ్యాత్మిక ఆశీర్వాద తరంగం నన్ను ముంచెత్తేసింది. సనాతన సన్యాసాశ్రమ స్థాయికి[1] హఠాత్తుగా నన్ను పెంచినందుకు చిరునవ్వు నవ్వుతూ, ఆ విధంగా నన్ను గౌరవించి, మానవరూపంలో ఉన్న మహామహులుగా, దేవదూతసదృశులుగా స్పష్టమవుతున్న ఆయన పాదాలకు ప్రణామం చేశాను.”

“ ‘బాబాజీ- నిజంగా బాబాజీయే- చెట్టుకింద తమకు దగ్గరగా ఉన్న ఒక ఆసనం నాకు చూపించారు. ఆయన బలిష్ఠంగా, పడుచు వయస్సులో ఉన్నవారు; లాహిరీ మహాశయుల్ని పోలి ఉన్నారు. ఈ మహానుభావులిద్దరి రూపురేఖల్లోనూ ఉండే అసాధారణమైన పోలికల్ని గురించి అంతకుముందు నేను తరచుగా వినే ఉన్నప్పటికీ అప్పుడా పోలిక నాకు తట్టలేదు. ఒక వ్యక్తి మనస్సులో ఏ నిర్దిష్ట భావమైనా తల ఎత్తకుండా నిరోధించే శక్తి బాబాజీకి ఉంది. ఆయన్ని నేను గుర్తు పట్టి భయ

  1. ఉత్తరోత్తరా శ్రీయుక్తేశ్వర్‌గారికి, బుద్ధగయలోని మహంతుగారు, అనుష్టానికంగా సన్యాస దీక్ష ఇచ్చారు.