పుట:Oka-Yogi-Atmakatha.pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాహిరీ మహాశయుల పావన జీవనం

577

లాహిరీ మహాశయులకు కాశీలో ఉన్న శిష్యులే కాకుండా, భారతదేశంలో దూరప్రాంతాల నుంచి కూడా వందలకొద్దీ శిష్యులు ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. తమ కుమారు లిద్దరి అత్తవారిళ్ళకు వచ్చిన సందర్భాల్లో ఆయన, చాలామాట్లు బెంగాలు వచ్చారు. ఆ విధంగా, ఆయన ఉనికివల్ల బెంగాలు, చిన్నచిన్న క్రియాయోగి బృందాల తేనెపట్టు అయింది. ముఖ్యంగా, కృష్ణనగర్, విష్ణుపూర్ జిల్లాల్లో అనేకమంది నిరాడంబర శిష్యులు ఈ నాటికీ, ఆత్మధ్యానపరమయిన అదృశ్యవాహిని ప్రవహిస్తూ ఉండేటట్టు చేస్తున్నారు.

లాహిరీ మహాశయుల దగ్గర క్రియాయోగ దీక్ష పొందిన అనేకమంది మహాపురుషుల్లో చెప్పుకోదగ్గవారు - కాశీలో ఉండే, ప్రఖ్యాతులు స్వామి భాస్కరానంద సరస్వతి, ఉన్నత మూర్తిమత్వం గల దేవఘర్ తపస్వి బాలానంద బ్రహ్మచారి, లాహిరీ మహాశయులు కొంతకాలంపాటు, కాశీలోని మహారాజ ఈశ్వరీ నారాయణ్ సింహ బహాదూర్ వారి కుమారుడికి ప్రయివేట్ ట్యూటరుగా పనిచేశారు. గురువుగారి ఆధ్యాత్మిక సిద్ధిని గుర్తించి, ఆ మహారాజూ ఆయన కుమారుడూ కూడా వారి దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు; అలాగే మహారాజ యతీంద్రమోహన్ ఠాకుర్‌గారు కూడా దీక్ష తీసుకున్నారు.

లాహిరీ మహాశయుల శిష్యుల్లో పలుకుబడి గల లౌకిక పదవుల్లో ఉన్న కొందరికి, ప్రచారం ద్వారా క్రియాయోగి మండలిని విస్తృతం చెయ్యాలన్న కోరిక ఉంటుండేది. గురువుగారు దానికి అనుమతి ఇవ్వలేదు. కాశీరాజుకు వైద్యుడుగా ఉన్న ఒక శిష్యుడు - గురువుగారి పేరును “కాశీ బాబా” (కాశీలో ఉండే మహామహులు)[1]గా వ్యాప్తి చెయ్యడానికి

  1. లాహిరీ మహాశయులకు శిష్యు లిచ్చిన ఇతర బిరుదులు: ‘యోగివర్’ (యోగుల్లో శ్రేష్ఠులు), ‘యోగిరాజ్’ (యోగుల్లో రాజువంటివారు), ‘మునివర్‌’ (మునుల్లో శ్రేష్ఠులు); ఇవికాక నేను చేర్చింది మరొకటి. ‘యోగావతార్’ (మానవ రూపంలో జన్మించిన యోగవిద్య),