పుట:Oka-Yogi-Atmakatha.pdf/603

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాహిరీ మహాశయుల పావన జీవనం

567

ఆయన బాప్తిస్మ మిచ్చే యోహానును గురించి తమకు చెప్పాడని అప్పుడు శిష్యులు గ్రహించారు.”[1] మళ్ళీ అంటాడు క్రీస్తు: “యోహాను కాలం వరకు ప్రవక్తలు ప్రవచించారు; ధర్మశాస్త్రం కూడా ప్రవచించింది. మీరు గ్రహించేటట్లయితే, రావలసి ఉన్న ఏలీయా ఇతడే.”[2]

తాను ఏలీయా (ఎలిజా)[3] నన్న విషయం యోహాను ఒప్పుకోక పోవడంలో యోహాననే వినయ వేషంలో ఉన్న తాను, మహాగురువైన ఎలిజా బాహ్యోత్కర్షతో వచ్చినవాణ్ణి కానని చెప్పడం అతని ఉద్దేశం. పూర్వజన్మలో తాను, తన మహిమ అనే “ఉత్తరీయాన్నీ” ఆధ్యాత్మిక సంపత్తినీ శిష్యుడైన ఎలిషాకు ఇచ్చేశాడు. “ఎలిషా అన్నాడు, - మిమ్మల్ని వేడుకుంటాను, మీ ఆత్మశక్తికి రెట్టింపు భాగం నాకు ప్రాప్తించేలా అనుగ్రహించండి అన్నాడు. దానికి అతను చెప్పాడు, నువ్వు కష్టమయింది అడుగుతున్నావు; అయినా, నీ నుంచి నన్ను తీసుకుపోతూండగా నువ్వు నన్ను చూసేటట్లయితే నీ కోరిక నెరవేరుతుంది... ఎలిజా మీది నుంచి పడ్డ ఉత్తరీయాన్ని, అతను తీసుకున్నాడు.”[4]

ఆయన నిర్వహించే పాత్ర ఇప్పుడు తారుమారయింది; కారణ మేమిటంటే, దైవపరంగా పరిపూర్ణత సిద్ధించిన ఎలిషా- ఏసుకు, ఎలిజా- యోహాను ప్రత్యక్ష గురువుగా ఉండవలసిన అవసరం ఇక మీదట లేదు. కొండమీద క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు,[5] మోషే (మోసెస్) లో

  1. మత్తయి 17 : 12-13.
  2. మత్తయి 11 : 13.14.
  3. యోహాను 1 : 21.
  4. II రాజులు 2 : 9-14.
  5. మత్తయి 17 : 3.