పుట:Oka-Yogi-Atmakatha.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

568

ఒక యోగి ఆత్మకథ

ఆయన చూసినది, తన గురువు ఏలీయాను. శిలువ మీద తన అంత్య సమయంలో ఏసు ఇలా ఆరిచాడు: ‘ఏలీ, ఏలీ లామా సబక్తానీ?’ “అంటే, నా దేవా, నా దేవా, నన్నెందుకు వదిలేశావు?” అని అర్థం. అక్కడ నిలబడి ఉన్నవాళ్ళలో కొందరు, అది విన్నప్పుడు, ఈయన ఏలీయాను పిలుస్తున్నాడు... ఈయన్ని కాపాడ్డానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం అన్నారు.”[1]

కాలావధిలేని గురుశిష్య సంబంధం, యోహానుకూ ఏసుకూ ఉన్నట్టుగానే బాబాజీకి లాహిరీ మహాశయులకూ కూడా ఉంది. మృత్యుంజయులైన ఆ పరమ గురుదేవులు, తమ శిష్యుడి జన్మలు రెంటికీ మధ్య వడివడిగా సుళ్ళు తిరిగిన లోతయిన అఖాత జలాల్ని ఈదుకుంటూ దాటి, పిల్లవాడిగానూ పెద్దవాడిగానూ లాహిరీ మహాశయులు గడిపే జీవిత క్రమానికి దారి చూపించారు. ఎన్నడూ విడిపోని బంధాన్ని బహిరంగంగా మళ్ళీ కూర్చడానికి, తమ శిష్యుడికి ముప్ఫైమూడో ఏడు వస్తేనేకాని సరైన కాలం రాలేదని బాబాజీ భావించారు.

రాణీఖేత్ సమీపంలో కొన్నాళ్ళు కలిసి ఉన్న తరవాత, స్వార్థరహితులైన గురుదేవులు, తమ ప్రియశిష్యుణ్ణి తమ దగ్గరే ఉంచేసుకోకుండా, బాహ్యమైన లోకకళ్యాణ సాధనకోసం లాహిరీ మహాశయుల్ని విడుదల చేశారు. “నాయనా, నేను నీకు అవసరమయినప్పుడల్లా వస్తాను.” అటువంటి వాగ్దానంలోని అనంతమైన నిబంధనల్ని మర్త్యుడైన ఏ ప్రేమికుడు పాటించగలడు?

సమాజ సామాన్యానికి తెలియకుండానే, కాశీలో ఒక మారుమూల, 1861 లో, మహత్తరమైన ఒకానొక ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ఆరంభ

  1. మత్తయి 27 : 46–49.