పుట:Oka-Yogi-Atmakatha.pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

566

ఒక యోగి ఆత్మకథ

పాత నిబంధన గ్రంథంలోని చివరి ఆంశం, ఎలిజా ఎలిషాల పునర్జన్మ గురించి ముందుగా భవిష్యత్ సూచన చెయ్యడం: “చూడండి. ప్రభువు తాలూకు మహత్తర, భయంకర దినం రావడానికి ముందు, ఎలిజా ప్రవక్తను మీ కోసం పంపిస్తాను.”[1]

ఈ ప్రకారంగా “ప్రభువు......రావడానికి ముందు” పంపగా వచ్చిన యోహాను (ఎలిజా), క్రీస్తు రాకను చాటడానికి ఉపకరించే విధంగా, ఆయనకన్న కొద్దిగా ముందుగా పుట్టాడు. యోహాను తండ్రి అయిన జకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షమైనది. అతనికి పుట్టబోయే కొడుకు యోహాను ఎలిజా (ఏలీయా) తప్ప మరొకరు కారని ధ్రువపరచడానికి.

“కాని దేవదూత అతనికి ఇలా చెప్పాడు, భయపడకు, జకర్యా. ఏమంటే, నీ ప్రార్థన వినబడింది; నీ భార్య ఎలీసబెత్తు నీ కో కొడుకును కంటుంది; అతనికి నువ్వు యోహాను అని పేరు పెడతావు. ఇశ్రాయేలీయులు సంతానంలో అనేక మందిని అతను, వాళ్ళ దేవుడివేపు తిప్పుతాడు. తండ్రుల హృదయాన్ని పిల్లలవేపు, అవిధేయుల్ని న్యాయపరుల జ్ఞానమార్గంవేపు తిప్పడానికి ప్రభువు[2] ఆగమనంకోసం ఆయత్తమై ఉన్న ప్రజల్ని సిద్ధం చెయ్యడానికీ, ‘ఏలీయా ఆత్మతోనూ శక్తితోనూ, ఆయన రాకకు ముందే వస్తాడు.[3]

యోహానును ఏసు, ఎలిజా (ఏలీయా) గా రెండుసార్లు నిర్ద్వంద్వంగా గుర్తుపట్టాడు. “ఏలీయా ఇదివరకే వచ్చాడు; వాళ్ళది ఎరగరు...

  1. మలాకి 4: 5.
  2. లూకా 1: 13-17.
  3. “ఆయన రాకకు ముందే,” అంటే, “ప్రభువు రాకకు ముందే.”