పుట:Oka-Yogi-Atmakatha.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 35

లాహిరీ మహాశయుల

పావన జీవనం

“ఈ ప్రకారం సర్వధర్మాన్ని పాటించడం మనకు ఉచితం.”[1] బాప్టిస్ట్ యోహాను (జాన్) తో అన్న ఈ మాటల్లోనూ, తనకు బాప్టిజం ఇమ్మని యోహాన్ను కోరడంలోనూ ఏసు, తన గురువుకు గల దివ్యాధికారాల్ని అంగీకరిస్తున్నాడు.

ప్రాచ్యదేశీయుడి దృక్పథం[2]తో పూజ్యభావంతో బైబిలు అధ్యయనం చేసిన మీదటా సహజావబోధంతో గ్రహించిన మీదటా, బాప్టిస్ట్ యోహాను పూర్వజన్మల్లో క్రీస్తుకు గురువని నాకు నమ్మకం కుదిరింది. పూర్వజన్మల్లో యోహాను ఎలిజా (Elijah) గానూ అతని శిష్యుడయిన ఏసును ఎలిషా (Elisha) గానూ బైబిలులో అనేక భాగాలు సూచిస్తాయి. (బైబిలు పాత నింబధన గ్రంథంలో ఉన్న వర్ణక్రమ మిది. గ్రీకు అనువాదకులు ఈ పేర్లలో ఎలిజాను Elia3 అని, ఎలిషాను Eliseus అని రాశారు. ఇలా మార్చిన రూపాలే కొత్త నిబంధన గ్రంథంలో మళ్ళీ కనిపిస్తాయి).

  1. మత్తయి 3 : 15.
  2. పునర్జన్మ సిద్ధాంతాన్ని, బైబిలు - పాత నిబంధన గ్రంథమూ కొత్త నిబంధన గ్రంథమూ రాసినవాళ్ళు అర్థంచేసుకున్నట్టూ దాన్ని అంగీకరించినట్టూ బైబిలు భాగాలు అనేకం వెల్లడిస్తాయి.