పుట:Oka-Yogi-Atmakatha.pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

564

ఒక యోగి ఆత్మకథ

“నేనే తపస్విని దాటి వెళ్ళీ వెళ్ళగానే, నా చూపు బాబాజీ మీదపడి ఆశ్చర్యపోయాను. ఆయన, తల అట్టకట్టేసిన ఒక సన్యాసిముందు మోకరిల్లుతున్నారు.”

“గురూజీ!” అంటూ ఆయన పక్కకి వెళ్ళాను. ‘మీ రిక్కడ ఏం చేస్తున్నారు?’ ”

“ ‘నేను ఈ సన్యాసి కాళ్ళు కడుగుతున్నాను; తరవాత ఈయనకు వంటగిన్నెలు తోమిపెడతాను.’ బాబాజీ, చిన్న పిల్లవాడిలా నా వేపు చూసి చిరునవ్వు నవ్వారు; మనుషులు అధికులయినా అధములయినా, వాళ్ళ దేహాలయాలన్నిటిలోనూ సమానంగానే ఈ్వరుడు నివసిస్తున్నట్టు చూడాలి కాని ఎవ్వరినీ నేను విమర్శించగూడదని తాము కోరుతున్నట్టు నాకు తెలియజేస్తున్నారని గ్రహించాను.

“మహాగురువులు ఇంకా ఇలా చెప్పారు, ‘సాధువుల్లో జ్ఞానుల్నీ అజ్ఞానుల్నీ కూడా సేవించడంవల్ల నేను, అన్నిటికంటె ఎక్కువగా దేవుడికి సంతోషం కలిగించే వినయమనే సర్వోత్తమ గుణాన్ని అలవరుచు కుంటున్నాను.’ ”[1]

  1. “స్వర్గంలోనూ భూలోకంలోనూ ఉన్నవాటిని చూడ్డానికి [ఆయన], తనను తాను తక్కువచేసుకుంటాడు.” సామ్స్ 113 : 6. “తనను తాను గొప్పగా తలుచుకునేవాడల్లా నీచపడక తప్పదు; తనను తాను తక్కువ చేసుకునేవాడు గొప్పవాడు కాకమానడు.” - మత్తయి 23 : 12 (బైబిలు).

    అహంకారాన్ని; లేదా మిథ్యామమత్వాన్ని తగ్గించడమంటే తన అనంతసత్తను ఆవిష్కరించుకోడమన్నమాట.