పుట:Oka-Yogi-Atmakatha.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాల్లో మహాభవన సృష్టి

559

‘రాణీఖేత్‌కు అతని బదిలీ పొరపాటున జరిగింది. రాణిఖేత్ విధులు చేపట్టడానికి మరో వ్యక్తిని పంపి ఉండవలసింది.’

“భారతదేశంలో ఈ బహుదూర స్థలానికి నన్ను రప్పించడానికి దారి తీసిన సంఘటనల, పరస్పర వ్యతిరేక దిశాభిముఖమైన గుప్త ప్రవాహాల్ని తలుచుకుంటూ చిరునవ్వు నవ్వుకున్నాను.”

“దానాపూర్‌కు తిరిగి వచ్చే ముందు మురాదాబాద్‌లో ఉన్న ఒక బెంగాలీ కుటుంబంలో కొన్నాళ్ళు గడిపాను. అక్కడ నన్ను కలుసుకోడానికి ఆరుగురు వచ్చారు. ఆధ్యాత్మిక విషయాల మీదికి నేను సంభాషణ మళ్ళించేసరికి, నాకు ఆతిథ్యమిచ్చినాయన నిరాశగా ఇలా అన్నారు:”

“ ‘ప్చ్, ఈ రోజుల్లో ఇండియాలో సాధువులే కరువయ్యారు!’ ”

“దానికి నేను, ‘బాబూ, ఈ గడ్డమీద ఇప్పటికీ ఉన్నారు. మహామహులు!’ అంటూ ఆక్షేపణ తెలిపాను.”

“ఉత్సాహం పెల్లుబకడం వల్ల, హిమాలయాల్లో నా అలౌకిక అద్భుత అనుభవాల్ని వాళ్ళకి చెప్పాలన్న ఊపు వచ్చింది నాకు. ఆ మిత్రబృందం మర్యాదగానే అపనమ్మకం తెలియబరిచింది.”

“వాళ్ళలో ఒకరు ఊరడింపుగా ఇలా అన్నారు: ‘లాహిరీగారూ, పలచబడ్డ ఆ కొండగాలుల్లో మీ మనస్సు ప్రయాసకు గురి అయింది. మీరిప్పుడు చెప్పింది, ఏదో పగటి కల!’

“సత్యనిష్ఠమైన ఉత్సాహంతో ఊగిపోయి, ఉచితమైన ఆలోచన కొరవడి మాట్లాడాను. “నేను కనక పిలిచినట్లయితే, నా గురుదేవులు ఇక్కడ, ఈ ఇంట్లోనే దర్శనమిస్తారు.’ ”

“ప్రతి ఒక్కరి కళ్ళలోనూ ఆసక్తి మిలమిల్లాడింది; అటువంటి