పుట:Oka-Yogi-Atmakatha.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

558

ఒక యోగి ఆత్మకథ

‘స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్’ అని భగవద్గీతలో[1] ఇచ్చిన గొప్ప హామీని నీ శిష్యుల్లో ప్రతి ఒక్కరికీ వినిపించు.’ [“ఈ ధర్మం (మత సంబంధమైన కర్మకాండ, లేదా సత్కర్మ) ఏ కొద్దిపాటి ఆచరణలో పెట్టినా, అది నిన్ను పెద్ద భయంనుంచి (మహతో భయాత్) కాపాడుతుంది”. అంటే, జననమరణ చక్ర పరిక్రమణలో సహజంగా ఉండే మహాక్లేశాల నుంచి కాపాడుతుంది].

“మర్నాడు ఉదయం నేను వీడుకోలు దీవెన కోసం గురుదేవుల పాదాలదగ్గర మోకరిల్లినప్పుడు, ఆయన్ని విడిచి వెళ్ళాలంటే నాలో ఎంత గాఢమైన అనిష్టముందో ఆయన పసిగట్టారు.”

“ ‘మనకి ఎడబాటు లేదు నాయనా,’ అంటూ ఆప్యాయంగా నా భుజం నిమిరారు. ‘నువ్వు ఎక్కడున్నా, నన్నెప్పుడు పిలిచినా, తక్షణం నీ దగ్గర ఉంటాను,” అన్నారు.

“ఆయన చేసిన అద్భుతమైన ఈ వాగ్దానంవల్ల ఊరట చెంది కొత్తగా పొందిన దివ్యజ్ఞాన స్వర్ణంతో సంపనుణ్ణి అయి కొండ దిగుదల దారి పట్టాను. ఆఫీసులో నా తోటి ఉద్యోగులు నాకు మనసారా స్వాగతం పలికారు; పది రోజులుగా వాళ్ళు, హిమాలయారణ్యాల్లో నన్ను పోగొట్టుకున్నామనే అనుకున్నారు. త్వరలో మా ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తరం వచ్చింది.

“ ‘లాహిరీ దానాపూర్ ఆఫీసుకు తిరిగి రావాలి,‘ అని ఉంది.”

  1. అధ్యాయం 2 : 40.