పుట:Oka-Yogi-Atmakatha.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునిక భారతీయ యోగీశ్వరులు బాబాజీ

533

కొమ్ముకు దిగువునన్న బండల వరసవేపు చూపించాడు. ‘మీరు నన్ను స్వీకరించని పక్షంలో ఈ కొండమీంచి దూకేస్తాను. దైవాన్వేషణలో నేను మీ గురుత్వం పొందలేకపోయినట్లయితే నా జీవితం నిరర్థకం.’ ”

“ ‘అయితే దూకు,’ అన్నారు బాబాజీ, ఏమాత్రం ఉద్రేకం లేకుండా. “నీ ప్రస్తుత పరిస్థితిలో నిన్ను నేను స్వీకరించలేను.’ ”

“వెంటనే ఆ మనిషి కొండమీంచి దూకేశాడు. అది చూసి శిష్యులు కొయ్యబారిపోయారు. బాబాజీ వాళ్ళవేపు చూసి, ఆ అగంతకుడి కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు. చితికిన కాయాన్ని తెచ్చి శిష్యులు ఎదురుగా పెట్టగానే మహాగురువులు, దాని మీద తమ చెయ్యి వేశారు. వెంటనే, చనిపోయినవాడు కళ్ళు విప్పి సర్వశక్తిమంతులయిన గురుదేవుల ముందు సువినయంగా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు.”

“ ‘ఇప్పుడు పనికొస్తావు నువ్వు, శిష్యరికానికి,’ అంటూ బాబాజీ, మళ్ళీ బతికిన శిష్యుడివేపు ఆప్యాయంగా చూశారు. ‘కఠినమయిన పరీక్షను ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడివయావు నువ్వు.[1] చావన్నది మరి మళ్ళీ తాకదు నిన్ను; నువ్విప్పుడు మా అమరబృందంలో ఒకడివి,’ అన్నారు. ఆ తరవాత, అలవాటు ప్రకారం, ‘డేరా డండా ఉఠావో’ అంటూ బయలు దేరమన్నారు. మరుక్షణంలో వారి బృందమంతా కొండమీంచి మాయమయింది.”

  1. విధేయతకు సంబంధించిన పరీక్ష. జ్ఞానపూర్ణులయిన గురుదేవులు, ‘దూకు,’ అనగానే ఆ వ్యక్తి విధేయుడయి దూకేశాడు. దాని కతను వెనకాడి ఉంటే, బాబాజీ గురుత్వం పొందలేని జీవితం నిరర్థకమని భావిస్తున్నట్లుగా తను చెప్పిన మాటలు అబద్ధమని రుజువయ్యేవి. అంతేకాదు, గురువుమీద తనకు సంపూర్ణమయిన విశ్వాసం లేదన్న సంగతి బయట పెట్టుకునేవాడు. అందువల్ల ఈ పరీక్ష కఠినమూ అసాధారణమూ అయినప్పటికీ అప్పటి స్థితిలో అదే సరయినది