పుట:Oka-Yogi-Atmakatha.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

532

ఒక యోగి ఆత్మకథ

తెలుసు నాకు,” అంటూ చెప్పుకొచ్చారు, కేవలానందగారు. “ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు, పవిత్రమయిన వైదిక క్రతువు ఒకటి చెయ్యడానికి, భగభగా పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చునిఉన్నారు. ఉన్నట్టుండి గురువుగారు, మండుతున్న కట్టె ఒకటి తీసుకొని, హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజం మీద కొట్టారు.

“ ‘స్వామీ, ఎంత క్రూరం!’ అన్నారు ఆపేక్షణగా, అక్కడే ఉన్న లాహిరీ మహాశయులు.

“ ‘అయితే ఇతను, తన పూర్వకర్మ ఫలానుసారంగా నీ కళ్ళముందే కాలి బూడిద అయిపోతూంటే చూస్తూంటావా?’ ”

“ఈ మాటలతో బాబాజీ, శిష్యుడి వికృత భుజం మీద ఉపశమన చాయకమయిన తమ చెయ్యి వేశారు. ‘ఈ రాత్రి నిన్ను బాధాకరమయిన మృత్యువునుంచి తప్పించాను. నిప్పు సెగవల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మనియమం నెరవేరింది’; అన్నారాయన.

“మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బృందం దగ్గరికి ఒక అగంతకుడు రావడంవల్ల ప్రశాంతతకు భంగం కలిగింది. గురుదేవులు బసచేసిన చోటికి దగ్గరగా, చేరడానికి దాదాపు అశక్యమయిన కొండ కొనకొమ్ముకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతో అతడు ఎక్కవచ్చాడు.”

“స్వామీ, బాబాజీ అనే మహానుభావులు మీరే అయి ఉండాలి. ఆ వ్యక్తి ముఖంలో మాటలకందని భక్తిప్రపత్తులు వెలుగొందాయి. ‘మీ కోసం, చేరరాని ఈ కోసుగుట్టల్లో నెలలు తరబడిగా అంతులేకుండా వెతుకుతున్నాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకొంటున్నాను,’ అన్నాడు.”

“మహాగురువులు మారు పలకకపోయేసరికి అతడు, కొండ