పుట:Oka-Yogi-Atmakatha.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 32

చనిపోయిన రాముణ్ణి

బతికించడం

“ఇప్పుడు లాజరు అనే ఆయన జబ్బుగా ఉన్నాడు. ఆ సంగతి ఏసు విన్నప్పుడు, ‘ఈ జబ్బు చావు కోసం వచ్చింది కాదు; దేవుడి మహిమ కోసం, దానివల్ల దేవుని కుమారుడు కూడా మహిమాన్వితుడు కావడం కోసం వచ్చింది’, అన్నాడు.”[1]

శ్రీయుక్తేశ్వర్‌ గారు ఒకనాడు వెచ్చటి పొద్దుటి వేళ , శ్రీరాంపూర్ ఆశ్రమం బాల్కనీలో, క్రైస్తవ పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. గురుదేవుల ఇతర శిష్యులు కొందరితో బాటు నేను కూడా, కొద్దిమంది మా రాంచీ విద్యార్థులతో అక్కడున్నాను.

“ఈ సందర్భంలో ఏసు, తనను దేవుడి కుమారుడుగా చెప్పుకున్నాడు. ఆయన నిజంగా దేవుడితో ఏకాత్ముడయి ఉన్నప్పటికీ, ఇక్కడ ఆయన ప్రస్తావనకు వ్యక్తి పరంకాని గంభీరమైన ప్రాముఖ్యం ఉంది.” అని వివరించారు. మా గురుదేవులు. “దేవుడి కుమారుడంటే, మనిషిలో ఉన్న కూటస్థ చైతన్యం లేదా దివ్యచైతన్యం. ‘మర్త్యు’ డెవడూ దేవుణ్ణి మాహిమాన్వితుణ్ణి చెయ్యలేడు. మానవుడు తన సృష్టికర్తకు ఇయ్యగల ఒకే ఒక గౌరవమల్లా, ఆయన్ని అన్వేషించడం; మానవుడు తనకి

  1. యోహాను 11 : 1-4 (బైబిలు).