పుట:Oka-Yogi-Atmakatha.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజ్యమాతతో సమావేశం

501

“గురుదేవుల సాంగత్యం ఏర్పడ్డ తొలి రోజుల్లో ఒకసారి, మా యజమాని ప్రతిఘటనను నేను ఎదుర్కోవలసి వచ్చింది,” అంటూ ఇంకా చెప్పారు రాయ్‌గారు. “ఆయన భౌతికవాదంలో పాతుకుపోయిన మనిషి.”

“ ‘మత పిచ్చగాళ్ళు నా దగ్గిర పని చెయ్యక్కర్లేదు,’ అంటూ ఎగతాళి చేసేవాడు. ‘ఎప్పుడయినా నీ దంభాచారి గురువును కలుసుకోడమే జరిగితే ఆయన జ్ఞాపకం ఉంచుకొనేలా కొన్ని మాటలు చెబుతాను,’ అన్నాడాయన.

“ఈ బెదిరింపు నా నిర్ణీత కార్యక్రమాన్ని ఆపలేకపోయింది; నేను దాదాపు ప్రతి సాయంత్రమూ నా గురుదేవుల సన్నిధిలో గడిపాను. ఒకనాడు రాత్రి మా యజమాని నా వెంబడి వచ్చి గురుదేవులు కూర్చునే గదిలోకి మొరటుగా చొరబడ్డాడు. అతను చెబుతానన్న మాటలు అనేసెయ్యడానికే తలపెట్టాడనడంలో సందేహం లేదు. అతను కూర్చోగానే లాహిరీ మహాశయులు, అక్కడున్న సుమారు పన్నెండుమంది శిష్యుల్ని చూసి ఇలా అడిగారు:

“ ‘మీ రో బొమ్మ చూస్తారా?’ ”

“మేము తల ఊపిన తరవాత వారు, గదిని చీకటి చెయ్యమన్నారు. ఒకరి వెనకాల ఒకరు గుండ్రంగా కూర్చుని, మీకు ముందున్న వ్యక్తి కళ్ళమీద చేతులు పెట్టండి,’ అన్నారు వారు.

“మా యజమాని కూడా, అయిష్టంగానే అయినా, గురుదేవుల సూచనల్ని పాటిస్తూ ఉండడం చూసి నేనేమీ ఆశ్చర్యపోలేదు. కొన్ని నిమిషాల తరవాత, మేము చూస్తున్నది ఏమిటో చెప్పమన్నారు, లాహిరీ మహాశయులు.”

“గురుదేవా, అందమైన ఒక స్త్రీ కనిపించిందండి. ఆవిడ ఎర్రరంగు