పుట:Oka-Yogi-Atmakatha.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

ఒక యోగి ఆత్మకథ

మరొక ప్రాముఖ్యం కూడా ఉంది; కాని రక్షరేకు మహిమను పూర్తిగా ఎవరూ బయట పెట్టగూడదనుకుంటాను.[1]

  1. (ఈ విధమైన) రక్షరేకన్నది అతీంద్రియ శక్తి ద్వారా ఉత్పన్నమయ్యే వస్తువు. దీని రూపం అశాశ్వతమైనది; అటువంటి వస్తువులు చివరికి ఈ లోకంలోంచి అంతర్ధానమై తీరవలసిందే (చూడండి అధ్యాయం 43). ఈ రక్షరేకు మీద ఒక మంత్రం చెక్కి ఉంది. శబ్దానికి వాక్కుకీ- అంటే, మానవ కంఠ స్వరానికి- ఉండే శక్తుల్ని గురించి భారతదేశంలో జరిపినంత గాఢ పరిశీలన మరోచోట ఎక్కడా జరగలేదు. విశ్వమంతటా ప్రతిస్పందించే ఓంకార నాద స్పందనకు (బైబిల్‌లోని “శబ్దం” లేదా “అనేక సముద్రాల ఘోష”) సృష్టిస్థితిలయాలనే మూడు రూపాలు లేదా గుణాలు ఉన్నాయి (తైత్తిరీయోపనిషత్తు 1 : 8). మనిషి ఒక మాట పలికినప్పుడల్లా, ఓంకారానికున్న ఈ మూడు గుణా లోనూ ఒకదాన్ని కార్యరూపంలోకి తెస్తున్నాడన్నమాట. మానవు డెప్పుడూ సత్యమే పలకాలని పవిత్ర గ్రంథా లన్నింటిలోనూ నిర్ణయించిన విధికి [సత్యం వద] ఆధారభూతమైన న్యాయహేతువు ఇదే.

    ఆ రక్షరేకు మీది సంస్కృత మంత్రాన్ని సరిగా ఉచ్చరించినట్లయితే, ఆధ్యాత్మికంగా, లాభదాయకమైన స్పందనశక్తి దానికి ఉంటుంది. ఆదర్శప్రాయంగా నిర్మించిన సంస్కృత వర్ణమాలలో యాభై అక్షరాలుంటాయి. ప్రతి అక్షరానికి నిర్దిష్టంగా స్థిరమైన ఉచ్చారణ ఒకటి ఉంటుంది. లాటిన్ భాష ప్రాతిపదికగా ఏర్పడిన ఆంగ్ల వర్ణమాల సంగతి వేరు. దీంట్లో ఉండే ఇరవయ్యారు అక్షరాలూ వివిధ ధ్వనుల భారాన్ని మొయ్యలేక సతమతమవుతూ ఉంటాయి. వీటినిగురించి జార్జి బెర్నార్డ్ షా, మంచి తెలివిగా, సహజ హాస్య స్ఫోరకంగా ఒక వ్యాసం రాశాడు. తనకు అలవాటయిన నిర్దాక్షిణ్య ధోరణిలో శ్రీ షా (“ఇంగ్లీషు భాష కొక ఇంగ్లీషు వర్ణమాలను ప్రవేశ పెట్టడానికి అంతర్యుద్ధ మొకటి జరగవలసి వచ్చినా... నేను దానికి బాధపడను.”) నలభై రెండు అక్షరాల కొత్త వర్ణమాలను చేబట్టాలని కోరాడు (విల్సన్ రాసిన ‘ది మిరాక్యులస్ బర్త్ ఆఫ్ లాంగ్వేజ్’ అన్న గ్రంథానికి రాసిన తొలిపలుకు చూడండి). ఆ మాదిరి వర్ణమాల, పరిపూర్ణత విషయంలో, సంస్కృత వర్ణమాలకు చేరువగా వస్తుంది. సంస్కృత వర్ణమాలలో యాభై అక్షరాలుండడంవల్ల ఉచ్చారణలో తప్పులు రానివ్వదు.