పుట:Oka-Yogi-Atmakatha.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా అమ్మ మరణం, విచిత్రమైన రక్షరేకు

33

అయితే, చివరికి ఈ రక్షరేకు, నా జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైపోయిందో, అది ఆ విధంగా పోవడం నాకొక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో చెప్పనక్కర లేదు.

[1]


  1. సింధు లోయలో బయల్పరిచిన కొన్ని సీళ్ళ మూలంగా, సంస్కృత వర్ణమాలను భారతదేశం సెమిటిక్ మూలాల నుంచి “ఎరువు తెచ్చుకుంది” అంటూ కొందరు పండితులు ఇప్పుడు చేస్తున్న వాదాన్ని విడిచిపెట్టేట్టు చేయడం జరిగింది. మొహంజో-దారో, హరప్పాలలో ఇటీవల బయల్పరిచిన కొన్ని గొప్ప హైందవ నగరాలు, “కేవలం ఉజ్జాయింపుగా ఊహించడానికి మాత్రమే వీలయిన యుగానికి మనల్ని తీసుకుపోగల మహత్తర సంస్కృతి కొకదానికి భారత భూమిలో పూర్వ చరిత్ర ఒకటి ఉండి ఉండాలి” అని సాక్ష్యమిస్తున్నాయి (సర్ జాన్ మార్షల్, 'మొహంజో-దారో అండ్ ది ఇండస్ సివిలిజేషన్', 1931). ఈ భూమి మీద, నాగరిక మానవుడికి మహోజ్జ్వలమైన ప్రాచీన చరిత్ర ఉందన్న హిందూవాదం నిజమయినట్లయితే, ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన సంస్కృత భాషే అత్యంత పరిపూర్ణమైన భాష అని చెప్పడానికి వీలవుతుంది. ఏషియాటిక్ సొసైటీ వ్యవస్థాపకుడు సర్ విలియం జోన్స్ ఇలా అంటాడు: “సంస్కృత భాషకి- దాని ప్రాచీనత విషయం ఏమైనా- దానికి అద్భుతమైన ఒక నిర్మాణక్రమముంది; అది గ్రీకు భాష కంటె పరిపూర్ణమైనది. లాటిన్ కంటె విస్తృతమైనది; ఈ రెండిటికంటె ప్రశస్తంగా పరిష్కృతమైనది.” ‘ఎన్ సైక్లో పేడియా అమెరికానా’ అన్న విజ్ఞాన సర్వస్వ గ్రంథ సంపుటంలో ఇలా ఉంది, “ప్రాచీన కావ్యాధ్యయనాన్ని పునరుద్ధరించిన తరవాత, పద్దెనిమిదో శతాబ్ది ఉత్తరభాగంలో, (పాశ్చాత్య పండితులు) సంస్కృత భాషాధ్యయనం ప్రారంభించడాన్ని మించిన ప్రముఖమైన సంఘటన సంస్కృతి చరిత్రలో మరొకటి లేనే లేదు. భాషాశాస్త్రం, తులనాత్మక వ్యాకరణం, తులనాత్మక పురాణ కథాశాస్త్రం, మతశాస్త్రం ... అన్నవాటి ఉనికికే ఆధారభూతమైనది కాని, అధ్యయనం వల్ల వాటిని గాఢంగా ప్రభావితం చేసినది కాని, సంస్కృత భాషావిష్కారమే.”