పుట:Oka-Yogi-Atmakatha.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 31

పూజ్యమాతతో

సమావేశం

“పూజ్యమాతాజీ, పసితనంలో నన్ను దీవెనతో అనుగ్రహించిన వారు అవతారపురుషులైన మీ పతిదేవులు. వారు మా తల్లిదండ్రులకీ, నా గురుదేవులైన శ్రీయుక్తేశ్వర్‌గారికి కూడా గురువులు. కనక, మీ పావన జీవనంలోని సంఘటనలు కొన్ని వినే మహదావకాశం నాకు ఇస్తారా?”

లాహిరీ మహాశయుల జీవిత సహధర్మచారిణి అయిన శ్రీమతి కాశీమణిగారిని ఇలా అడిగాను. కొద్దికాలం కాశీలో ఉండే అవకాశాన్ని వినియోగించుకుని ఈ పూజ్యురాలిని దర్శించాలని ఎంత కాలంగానో ఉన్న కోరిక ఇప్పుడు తీర్చుకుంటున్నాను.

లాహిరీ కుటుంబంవారి నివాసగృహంలో, ఆవిడ నాకు ఆదరపూర్వకంగా స్వాగతమిచ్చారు; ఆ ఇల్లు కాశీలో గురుడేశ్వర మొహల్లా అనే పేటలో ఉంది. వయస్సు పైబడినప్పటికీ ఆవిడ, ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లే పద్మంలా ఉన్నారు. ఆవిడది మధ్యరకం శరీరం; పసిమి చాయ, సన్నని మెడ, కాంతిమంతమైన విశాల నేత్రాలు.

“రా నాయనా, నువ్వు రావడం చాలా సంతోషం. మేడమీదికి రా.”

కాశీమణిగారు తమ పతిదేవులతో కొంతకాలం కాపురమున్న ఒక చిన్న గదిలోకి దారి తీశారు. సాటిలేని ఆ మహానుభావులు, దాంపత్యమనే