పుట:Oka-Yogi-Atmakatha.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజ్యమాతతో సమావేశం

493

మానవ నాటకంలో తమ పాత్ర నిర్వహించడానికి దిగివచ్చి పావనంచేసిన మందిరాన్ని దర్శించడం నా భాగ్యంగా భావించాను. ఆ దయామయి నన్ను తమ పక్కనే ఒక మెత్తమీద కూర్చోబెట్టుకున్నారు.

“నేను మావారి దివ్యమహత్వాన్ని గ్రహించడానికి చాలా ఏళ్ళు పట్టింది,” అంటూ ప్రారంభించా రావిడ. “ఒకనాడు రాత్రి, ఈ గదిలోనే నాకు స్పష్టమైన కల ఒకటి వచ్చింది. వెలుగులు విరజిమ్మే దేవదూతలు, ఊహకు అందనంత సుకుమారంగా, నాకు పైన, గాలిలో తేలుతున్నారు. ఆ దృశ్యం ఎంత వాస్తవికంగా ఉందంటే, నాకు వెంటనే మెలుకువ వచ్చింది; చిత్రంగా, గది అంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది.

“మావారు పద్మాసనంలో ఉండి, గది మధ్యలో గాలిలో తేలుతున్నారు; దేవదూతలు ఆయన్ని చుట్టి ఉన్నారు. వారు వినయ విధేయతలతో చేతులు జోడించి మావారికి మొక్కుతున్నారు.

“అపరిమితంగా ఆశ్చర్యచకితురాల్ని అయి, నే నింకా కల గంటూనే ఉన్నానని సమాధాన పడ్డాను.

“ ‘నువ్వు కలగనడం లేదు. నీ నిద్ర విడిచిపెట్టు - ఎప్పటికీ, ఎల్లప్పటికీ.’ అంటూ వారు మెల్లగా నేలకు దిగివస్తూ ఉండగా, వారి పాదాల దగ్గర మోకరిల్లాను.”

" ‘గురుదేవా,’ అంటూ అరిచాను. ‘మీకు మరీమరీ మొక్కుతాను! ఇంతకాలం మిమ్మల్ని నా భర్తగా భావించినందుకు క్షమిస్తారా నన్ను? నే నింతకాలం, దివ్యజాగృతి పొందినవారి పక్కనే ఉంటూ, అజ్ఞానంతో నిద్రలో ఉండిపోయానని తెలుసుకుని సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ