పుట:Oka-Yogi-Atmakatha.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలౌకిక ఘటనల నియమం

475

(ఎజెకీల్ 43 : 1-2 బైబిలు). నుదుటిమీద (తూర్పు) ఉన్న దివ్యనేత్రం ద్వారా, యోగి, “అనేక సముద్రాల” దివ్యఘోష అనే శబ్దాన్ని లేదా ఓంకారాన్ని వింటూ చైతన్యం నుంచి సర్వవ్యాపకత్వానికి ప్రయాణిస్తాడు; ఈ ఓంకారం, సృష్టిలోని ఏకైక సత్తకు కారకమైన కాంతి స్పందనలే.

విశ్వంలోని అనేక కోట్ల నిగూఢ రహస్యాలలో ఇంద్రియ గోచర మైనది కాంతి. కాంతితరంగాలు, శబ్దతరంగాల మాదిరిగా కాకుండా, అంతర్నక్షత్ర రోదసిలోని శూన్యంగుండా స్వేచ్ఛగా సంచారణ అవుతాయి; శబ్దతరంగాల సంచారణకు మాత్రం గాలికాని ఇతర భౌతిక వాహకాలు కాని అవసరమవుతాయి. తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతికి అంతర్గ్రహ వాహకంగా పనిచేస్తుందని చెప్పే, పరికల్పితమైన ఈథర్‌ను కూడా ఐన్‌స్టైన్ చెప్పిన కారణాలవల్ల పరిహరించవచ్చు; రోదసికున్న జ్యామితీయ గుణధర్మాలు, ఈథర్ సిద్ధాంతం అనవసరమయేటట్టు చేస్తాయని అన్నాడాయన. వీటిలో ఏ ఒక్క పరికల్పన ప్రకారమైనా కూడా కాంతి, ప్రాకృతిక దృశ్యమానరూపాల్లో ఏ ఒక్కదానికన్న అయినా అత్యంత సూక్ష్మంగానూ భౌతిక ఆలంబన రహితంగానూ ఉంటుంది.

ఐన్‌స్టైన్ బృహత్తర - భావనల్లో సాపేక్షతా సిద్ధాంతంలో ప్రాముఖ్యం వహించేది కాంతివేగం - సెకనుకు 1,86,300 మైళ్ళు, మానవుడి పరిమిత మనస్సుకు సంబంధించినంతవరకు, ప్రవాహశీలకమైన విశ్వంలో ఏకైక స్థిరరాశి కాంతివేగమేనని ఆయన గణితశాస్త్రపరంగా నిరూపించారు. మానవుల దేశ, కాల ప్రమాణాలన్నీ ఏకైక “నిరపేక్షం” అయిన కాంతివేగం మీదే ఆధారపడి ఉంటాయి. ఇంతకు పూర్వం అనుకుంటూ వచ్చినట్టుగా, దేశకాలాలు వేరు వేరు. శాశ్వత కారకాలు కావున