పుట:Oka-Yogi-Atmakatha.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

476

ఒక యోగి ఆత్మకథ

అవి సాపేక్షమైన, పరిమితి కారకాలు. వాటికి నియత మాపన మాన్యతలు కాంతివేగ ప్రమాణాన్ని బట్టే లభిస్తాయి.

కాలం, పరిమాణాత్మక సాపేక్షతగా రోదసితో చేరడంవల్ల దాని సరైన స్వభావం ఇప్పుడు వెల్లడి అయింది; సరళమైన సందిగ్ధతాసారమే అది. ఐన్‌స్టైన్, కొన్ని సమీకరణాల కలంపోట్లతో, ఒక్క కాంతిని మినహాయించి, తక్కిన ప్రతి స్థిరసత్యాన్ని విశ్వంనుంచి బహిష్కరించేశాడు.

ఉత్తరోత్తరా రూపొందించిన ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం (యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ) లో ఆ మహనీయ భౌతికశాస్త్రవేత్త, గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంతత్వాల నియమాల్ని కేవలం ఒకే ఒక్క గణిత సూత్రంలో పొందిపరిచాడు. బ్రహ్మాండ స్వరూపాన్ని, ఒకే నియమం మీద ఆధారపడ్డ వివిధ రూపాంతరాలుగా సంక్షేపించిన ఐన్‌స్టైన్, అనేక యుగాల్ని అడ్డంగా దాటిపోయి, సృష్టికి గల ఏకైక స్వరూపం, బహురూపధారణ చేసే మాయ అవి ప్రకటించిన ఋషుల సరసకు చేరాడు.

నవశకానికి నాంది పలికిన సాపేక్షతా సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొనే, పరమాణువును అన్వేషించగల అవకాశాలు గణితశాస్త్రపరంగా బయలుపడ్డాయి. అణువనేది శక్తేకాని పదార్థంకాదని చెప్పడమేకాక, ఆ అణుశక్తి మూలతః మనోద్రవ్యమని ఈనాడు గొప్పగొప్ప శాస్త్రవేత్తలు ధైర్యంగా నొక్కి చెబుతున్నారు.

“భౌతికశాస్త్రం ఛాయాలోకానికి సంబంధించినదన్న యథార్థమైన గ్రహింపు, అత్యంత గణనీయంగా పేర్కొదగ్గ అభివృద్ధులలో ఒకటి,” అని రాశాడు. సర్ ఆర్థర్ స్టాన్లీ ఎడింగ్టన్, ‘ది నేచర్ ఆఫ్ ది ఫిజికల్

వరల్డ్‌’[1] (భౌతిక ప్రపంచ స్వభావం) అనే గ్రంథంలో. “భౌతికశాస్త్ర

  1. మాక్మిలన్ కంపెనీ,